MoviesShocking Comment: అనుపమ నీకు ఇది అవసరమా..?

Shocking Comment: అనుపమ నీకు ఇది అవసరమా..?

అనుపమా పరమేశ్వరన్.. ఈ కర్లీ హెయిర్ బేబీ గురించి ఎంత చెప్పినా తక్కువే. మలయాళీ కుట్టి అయినా..చీర కట్టి తల్లో పూలు పెడితే అచ్చం తెలుగు అమ్మాయి లా కనిపిస్తుంది. చూడటానికి చక్కటి రూపం..ఆకట్టుకునే చిరునవ్వు..ఆమెలోని ప్రత్యేక ఆకర్షణ గా నిలిచాయి. ఆ కళ్ళల్లో అమాయకత్వం..అందరిని బాగా ఆకట్టుకుంటుంది. అనుపమకు జనాల్లో పిచ్చ క్రేజ్ ఉంది. మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది.

నిజం చెప్పాలంటే అనుపమ కెరీర్లో పెద్దగా చెప్పుకోదగ్గిన హిట్ సినిమాలు లేవు. అయినా కానీ, చేసిన ప్రతి సినిమాలో ఓ స్పెషల్ గుర్తింపు సంపాదించుకుంది. ఏ రోల్ చేసినా..ప్రత్యేక ఆకర్షణ నిలిచే..అనుపమ..చేసిన ప్రతి సినిమాలు వేరియేషన్స్ చూపిస్తూ..టాలీవుడ్ లో తనకంటూ ఓ ప్రత్యేకమైన ప్లేస్ ను సంపాదించుకుంది. ముఖ్యంగా కళ్ళతోనే ఎలాంటి ఎక్స్ ప్రేషన్ ని అయిన పలికించగలదు. ఇప్పటికే చాలా సినిమాలో తాను ఏంటో ప్రూవ్ చేసుకున్న ఈ బ్యూటీ.. నితిన్ తో అ..ఆ.. నాగ చైతన్యతో చేసిన ప్రేమమ్.. శర్వానంద్ తో నటించిన శతమానం భవతి సినిమాలు మంచి కిక్కిచ్చే హిట్ సాధించాయి.

కాగా, రీసెంట్ గా అనుపమా..నాని హీరో గా నటించిన “అంటే సుందరానికి” సినిమాలో ఓ గెస్ట్ రోల్ లో కనిపించింది. నిజానికి అది పెద్ద ఇంపార్ టెంట్ రోల్ కాదు.ఆమె రేంజ్ కి తగ్గ రోల్ అంతకన్నా కాదు..మరి అనుపమా ఎందుకు అలాంటి పాత్రకు ఓకే చెప్పిందో కూడా తెలియదు. సినిమా ప్రమోషన్స్ లో కూడా ఎక్కడ ఆమె పేరు చెప్పలేదు దానికి రీజన్ ఏంటో కూడా అర్ధంకావడం లేదు. అనుపమ హీరోయిన్ గా తెలుగు లో రెండు సినిమాలు చేస్తుంది. మరి ఇలాంటి టైంలో గెస్ట్ రోల్ ఏంటి..అన్న ప్రశ్నలు ఎదురవుతున్నాయి. కొందరు నెటిజన్స్ ఈ విషయంలో ఆమెను దారుణంగా ట్రోల్ చేస్తున్నారు. నీకు ఇలాంటి గతి పట్టిందా అని కామెంట్స్ చేస్తున్నారు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news