Moviesఅరెరెరె..కంగనాకు మొత్తం కరిగిపోయిందా..?

అరెరెరె..కంగనాకు మొత్తం కరిగిపోయిందా..?

బాలీవుడ్ బ్యూటీ కంగనా రనౌత్ ..ఈమె హీరోయిన్ గా కన్నా కూడా కాంట్రవర్షీయల్ కామెంట్స్ చేసే..ఎక్కువ పాపులర్ అయ్యింది. ఆ విషయం అందరికి తెలిసిందే. ఉన్నది ఉన్నత్లు మాట్లాడినా..కొంచెం రాష్ గా మాట్లాడటం..పచ్చి నిజాలను బయటపెట్టడంతో..అమ్మడుని అందరు దూరం పెట్టారు. ఇలాంటి ఫైర్ బ్రాండ్ తో మాకు ఎందుకు అనుకున్నారో..లేక ఈమె తో ఫ్రెండ్ షిప్ అంత మచిది కాదు అనుకున్నారో తెలియదు కానీ..మొత్తంగా అమ్మడుని దూరం పెట్టేశారు కొందరు బాలీవుడ్ పీపుల్స్.

ఇక రాజకీయనాయకులకు ఆమె అంటే దడే..పబ్లిక్ గా ఓపెన్ గా..అన్ని విషయాలు బయటపెడుతుండటంతో..ఆమె జోలికి ఎవ్వరు పోవడం లేదు. కాగా, చాలా రోజుల తరువాత ఆమె వెండితెర పై కనిపించింది. ఆమె హీరోయిన్ గా “ధాక‌డ్” మూవీ చేసింది. సినిమా స్టార్టింగ్ నుందీ అమ్మడుకు బాలీవుడ్ లో చేదు అనుభవాలు ఎదూరీన..అన్నింటిని తట్టుకుని..సినిమా రిలీజ్ చేసింది. ఈ సినిమాతో అమ్మడు జాతకం మారిపోది అనుకున్నింది.

కానీ, సీన్ కట్ చేస్తే…సినిమా దొబ్బెసింది. అట్టర్ ఫ్లాప్ గా నిలిచింది. ఆమె సినిమా ప్రదర్శిస్తున్నా ధియేటర్స్ ఖాళీ గా ఉన్నాయి. అంత దారుణ టాక్ సొంతం చేసుకుంది. ధాక‌డ్ హిందీ ప్రేక్ష‌కుల అభిరుచికి త‌గ్గ‌ట్లే తెర‌కెక్కినా..కానీ ఎందుకు ఆ యాక్ష‌న్ మూవీకి భారీ డిజాస్టర్ టాక్ ఇచ్చారు జనాలు. సుమారు ఈ సినిమాని రూ.100 కోట్ల‌ బ‌డ్జెట్ తో తెరకెక్కించారని అంటున్నారు. అంత బ‌డ్జెట్లో తీసిన సినిమాకు బాక్సాఫీస్ ద‌గ్గ‌ర కనీసం కలెక్షన్స్ కూడా రాబటలేకపోయిందంటే..సినిమా పరిస్ధితిని అర్ధం చేసుకోవచ్చు. కాగా, బాలీవుడ్ ఆమె కావాలనే టార్గెట్ చేస్తుందని..ఇలా డిజాస్టర్ల్తో కంగనా పతనం మొదలైంది అని చెప్పుతున్నారు బీ టౌన్ జనాలు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news