MoviesSSMB 28 టైటిల్‌పై కేక పెట్టించే న్యూస్‌... సెంటిమెంట్ రిపీట్‌...!

SSMB 28 టైటిల్‌పై కేక పెట్టించే న్యూస్‌… సెంటిమెంట్ రిపీట్‌…!

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం తన తాజా చిత్రం సర్కారు వారి పాట సినిమాతో బ్లాక్‌బ‌స్ట‌ర్ విజ‌యం త‌న ఖాతాలో వేసుకున్నాడు. గీత గోవిందం త‌ర్వాత ప‌ర‌శురాం పెట్ల ద‌ర్శ‌కత్వం వ‌హించిన ఈ సినిమా మిక్స్ డ్ టాక్‌తో కూడా బాక్సాఫీస్ ద‌గ్గ‌ర వ‌సూళ్ల వ‌ర్షం కురిపిస్తోంది. స‌రిలేరు నీకెవ్వ‌రు త‌ర్వాత మ‌హేష్ న‌టించిన సినిమా కావ‌డంతో మ‌హేష్ క‌టౌట్‌ను థియేట‌ర్లలో చూసేందుకే ఫ్యాన్స్ ఎగ‌బ‌డుతున్నారు. పైగా ఎఫ్ 3 సినిమా వ‌చ్చే వ‌ర‌కు స‌ర్కారుకు పోటీయే లేదు.

దీంతో బాక్సాఫీస్ వ‌ద్ద ఈ సినిమా క్లీన్ హిట్‌గా నిల‌వ‌డంతో పాటు చాలా రికార్డులు త‌న ఖాతాలో వేసుకోనుంది. కేవ‌లం నాలుగు రోజుల్లోనే వ‌ర‌ల్డ్ వైడ్‌గా రు. 95 కోట్ల షేర్ రాబ‌ట్ట‌డం.. అది కూడా ఓ రీజ‌నల్ లాంగ్వేజ్ సినిమా ఈ రేంజ్‌లో వ‌సూళ్లు కొల్ల‌గొట్టింది అంటే మామూలు విష‌యం కాదు. ఈ సినిమా స‌క్సెస్ ఎంజాయ్ చేస్తోన్న మహేష్‌బాబు నెక్ట్ మాట‌ల మాంత్రికుడు త్రివిక్ర‌మ్ శ్రీనివాస్ ద‌ర్శ‌కత్వంలో సినిమా చేస్తున్నాడు.

SSMB 28 అనే టైటిల్‌తో ఈ సినిమా ఫిబ్రవరి 2022 లో గ్రాండ్‌గా లాంచ్ చేశారు. గ‌తంలో మ‌హేష్‌బాబు – త్రివిక్ర‌మ్ కాంబోలో అత‌డు, ఖ‌లేజా రెండు సినిమాలు వ‌చ్చాయి. రెండు సినిమాలు క‌థ‌, క‌థ‌నాల ప‌రంగా బాగున్నా క‌మ‌ర్షియ‌ల్‌గా మాత్రం స‌క్సెస్ కాలేదు. ఖ‌లేజా 2010లో వ‌చ్చింది. ఈ సినిమా వ‌చ్చి కూడా 12 ఏళ్లు అవుతోంది. మ‌ళ్లీ ఇన్నేళ్ల‌కు వీరిద్ద‌రి కాంబోలో సినిమా కావ‌డం.. ఇటు మ‌హేష్ 4 వ‌రుస హిట్ల‌తో ఫామ్‌లో ఉండడంతో త్రివిక్ర‌మ్ – మ‌హేష్ కాంబోపై భారీ అంచ‌నాలే ఉన్నాయి.

ఈ సినిమా గురించి ఓ అదిరిపోయే అప్‌డేట్ బ‌య‌ట‌కు వ‌చ్చేసింది. ఈ సినిమా టైటిల్ రివీల్ చేసే డేట్ బ‌య‌ట‌కు వ‌చ్చేసింది. మే 31, 2022న అంటే సూపర్‌స్టార్ కృష్ణ పుట్టినరోజున ఈ సినిమా టైటిల్‌ ప్రకటించాలని టీమ్ ప్లాన్ చేస్తోంది. దీనిపై మేక‌ర్స్ నుంచి అధికారిక ప్ర‌క‌ట‌న రానుంది. ఈ సినిమాలో మహేష్ బాబుకు జోడీగా పూజా హెగ్డే నటిస్తోంది.

ఇటీవ‌ల కాలంలో హీరోయిన్‌ను రిపీట్ చేయ‌ని మ‌హేష్ మ‌హ‌ర్షి త‌ర్వాత పూజా హెగ్డేనే రిపీట్ చేస్తున్నాడు. త్రివిక్ర‌మ్‌కు సొంత బ్యాన‌ర్ లాంటిది అయిన హారిక అండ్ హాసిని క్రియేషన్స్ ఈ చిత్రాన్ని భారీ ఎత్తున నిర్మిస్తోంది. థమన్ ఎస్ ఈ సినిమాకు సంగీత ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news