Moviesవిశ్వ‌క్‌సేన్‌కు ఎన్టీఆర్‌, నాని ఫ్యాన్స్ స‌పోర్ట్‌... ర‌చ్చ మామూలుగా లేదే..!

విశ్వ‌క్‌సేన్‌కు ఎన్టీఆర్‌, నాని ఫ్యాన్స్ స‌పోర్ట్‌… ర‌చ్చ మామూలుగా లేదే..!

యంగ్ హీరో విశ్వక్సేన్ వర్సెస్ టీవీ 9 యాంకర్ దేవి మధ్య జరుగుతున్న సోషల్ మీడియా వార్‌ రోజురోజుకూ ముదురుతోంది.. మ‌లుపులు తిరుగుతోంది. మహిళా సంఘాలతో పాటు పలువురు మహిళా జర్నలిస్టులతో కలిసి దేవి తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ కు ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. అలాగే దేవికి మద్దతుగా కొందరు మానవ హక్కుల కమిషన్లో సైతం ఫిర్యాదు చేశారు. దేవి జర్నలిస్టుగా విశ్వక్‌సేన్‌పై తన ఫిర్యాదుల పరంపర కంటిన్యూ చేస్తుంటే సోషల్ మీడియాలో మాత్రం రోజురోజుకు విశ్వ‌క్‌ బలం పెరుగుతూ వస్తోంది.

విశ్వక్‌సేన్ నటించిన అశోకవనంలో అర్జున కళ్యాణం సినిమా ప్రమోషన్ లో భాగంగా విశ్వక్ చేసిన ఫ్రాంక్ వీడియో ప్రమోషన్ ను టీవీ9 టార్గెట్ చేస్తూ డిబేట్ నిర్వహించింది. ఈ డిబేట్లో విశ్వక్‌సేన్‌ నువ్వు పర్సనల్‌గా టార్గెట్ చేస్తూ పాగల్ సేన్ అన్న టైటిల్‌తో ఈ డిబేట్ నిర్వహిస్తుండగా విశ్వక్ నేరుగా టీవీ9 స్టూడియోలోకి వెళ్లడంతో గొడవ మొదలైంది.

ఈ గొడవ తర్వాత విశ్వ‌క్‌కు ఇండస్ట్రీ నుంచి ఎక్కువ మంది సప్పోర్ట్ చేస్తున్నారు. సీనియర్ నిర్మాత త్రిపురనేని చిట్టిబాబు మాట్లాడుతూ యాంకర్ దేవి గెటవుట్‌ అన్న పదం వాడి ఉండాల్సింది కాదని అన్నారు. దేవి విశ్వ‌క్‌ మాట్లాడుతున్నప్పుడు ఇరిటేట్ అయ్యి గెటవుట్ అనడం చాలా తప్పు అని కూడా ఆయన అన్నారు. ఇక త్రిబుల్ ఆర్ నటుడు రామకృష్ణ సైతం టీవీ 9 తీరును తప్పుబడుతూ విశ్వక్సేన్‌కు తాను మద్దతు ఇస్తున్నట్లు ప్రకటించారు.

గతంలో కూడా టీవీ9 లో తాను ఇబ్బంది పడిన ఈ విషయాన్ని ఆయన బయటపెట్టారు. ఇదిలా ఉంటే సోషల్ మీడియాలో స్టార్ హీరోల అభిమానులు సైతం విశ్వక్‌సేన్ కు బహిరంగంగా మద్దతు ఇస్తున్నారు.
విశ్వక్‌సేన్ ముందు నుంచి జూనియర్ ఎన్టీఆర్ అభిమాని. మ‌నోడి బాడీ లాంగ్వేజ్‌తో పాటు బిహేవియర్ జూనియర్ ఎన్టీఆర్ ను అనుకరించిన‌ట్టుగా ఉంటుంది.

తాను జూనియర్ ఎన్టీఆర్ వీరాభిమాని అన్న విషయాన్ని గతంలో కూడా చాలా సందర్భాల్లో చెప్పారు. దీంతో ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు అందరూ బహిరంగంగానే విశ్వ‌క్‌కు మద్దతు ఇస్తున్నారు. అశోకవనంలో అర్జున్ కళ్యాణం సినిమా హిట్ చేయాలని సోషల్ మీడియాలో కామెంట్లు పెడుతున్నారు. జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు విశ్వకు మద్దతు ఇస్తూ సోషల్ మీడియాలో చేస్తున్న హంగామా అయితే మామూలుగా లేదనే చెప్పాలి.

ఇక నేచురల్ స్టార్ నాని అభిమానులు… నాని ఆర్మీ కూడా విశ్వ‌క్‌కు సపోర్టు చేస్తున్నారు. వీరితో పాటు ఇండస్ట్రీలోని కొందరు పెద్దలు మీడియా హీరోలు సైతం టీవీ 9 తీరును తప్పుపడుతూ ఇంటర్నల్ గా మ‌నోడికి మద్దతు ఇస్తున్నారు. ఈ సంఘటన జరిగినప్పటి నుంచి గంటగంటకు సోషల్ మీడియాలో కూడా విశ్వ‌క్‌కు ఫాలోవ‌ర్స్ పెరుగుతున్నారు. ఏదేమైనా ఈ క్రేజ్ క్యాస్ చేసుకొని అర్జున్ వనంలో అశోక కళ్యాణం హిట్ అయితే విశ్వ‌క్‌కు మంచి పేరు వస్తుంది అని చెప్పాలి.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news