Moviesవ‌రుణ్‌తేజ్‌.. ' గ‌ని ' ప్రి రిలీజ్ బిజినెస్‌... టార్గెట్ మామూలుగా...

వ‌రుణ్‌తేజ్‌.. ‘ గ‌ని ‘ ప్రి రిలీజ్ బిజినెస్‌… టార్గెట్ మామూలుగా లేదే…!

మెగా ప్రిన్స్ వ‌రుణ్‌తేజ్ న‌టించిన గ‌ని సినిమా ఈ రోజు ప్ర‌పంచ వ్యాప్తంగా ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చింది. క‌రోనా దెబ్బ‌తో వ‌రుణ్ తేజ్ న‌టించిన సినిమాలు రిలీజ్ అయ్యి చాలా రోజులు అయ్యింది. ఎఫ్ 2, గ‌ద్ద‌ల‌కొండ గ‌ణేష్ లాంటి బ్యాక్ టు బ్యాక్ హిట్ల‌తో వ‌రుణ్ తేజ్ మార్కెట్ బాగా పెరిగింది. గ‌తంలో ఒక్కో సినిమాకు రు 5-6 కోట్లు తీసుకునే వ‌రుణ్ ఆ త‌ర్వాత రు. 8 కోట్ల‌కు పైనే తీసుకుంటున్నాడు. ఇక ఈ నెల‌లో గ‌నితో పాటు చివ‌ర్లో ఎఫ్ 3 సినిమాతో కూడా మ‌రోసారి రెండు వారాల వ్య‌వ‌ధిలోనే ప్రేక్ష‌కుల ముందుకు వ‌స్తున్నాడు.

ఎఫ్ 2 లాంటి బ్లాక్‌బ‌స్ట‌ర్ సినిమాకు సీక్వెల్‌గా అనిల్ రావిపూడి ఎఫ్ 3 సినిమాను తెర‌కెక్కించిన సంగ‌తి తెలిసిందే. ఇక వ‌రుణ్ తాజా సినిమా గ‌నికి అదిరిపోయే ప్రి రిలీజ్ బిజినెస్ జ‌రిగింద‌ని అంటున్నారు.
రెండు తెలుగు రాష్ట్రాల్లో రూ. 21 కోట్ల బిజినెస్ చేసిందని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. ఏరియాల వారీగా ఈ సినిమా ప్రి రిలీజ్ బిజినెస్ లెక్క‌లు ఇలా ఉన్నాయి..

నైజాం – 8 కోట్లు

సీడెడ్ – 3.50 కోట్లు

ఆంధ్రా – 9.50 కోట్లు

ఆంధ్రా ఏరియా వ‌ర‌కు ఈ సినిమాకు రు. 21 కోట్ల బిజినెస్ జ‌రిగింది. ఇక ఓవ‌ర్సీస్‌లో 1.80 కోట్లు – క‌ర్నాక‌ట‌, రెస్టాఫ్ ఇండియా 2.50 కోట్లు బిజినెస్ చేసింది. వ‌ర‌ల్డ్ వైడ్‌గా చూస్తే రు 25. 30 కోట్ల థియేట్రిక‌ల్ బిజినెస్ చేసింది. క‌రోనా త‌ర్వాత వ‌స్తోన్న ఈ సినిమాకు ఇది భారీ టార్గెట్టే అనుకోవాలి. సాయి కొర్ర‌పాటి ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ సినిమాలో వ‌రుణ్‌కు జోడీగా ద‌బాంగ్ బ్యూటీ సాయి మంజ్రేక‌ర్ హీరోయిన్‌గా న‌టించింది. ఇక ఉపేంద్ర‌, సునీల్ శెట్టి, జ‌గ‌ప‌తిబాబు, న‌దియా, న‌రేష్‌, త‌నికెళ్ల భ‌ర‌ణి, న‌వీన్ చంద్ర త‌దిత‌రులు కీల‌క పాత్ర‌ల్లో క‌నిపించారు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news