Moviesలావ‌ణ్య త్రిపాఠి - వ‌రుణ్ తేజ్ పీక‌ల్లోతు ప్రేమ బ‌యట పెట్టిన...

లావ‌ణ్య త్రిపాఠి – వ‌రుణ్ తేజ్ పీక‌ల్లోతు ప్రేమ బ‌యట పెట్టిన ‘ గ‌ని ‘ సినిమా…!

మెగా ప్రిన్స్ వ‌రుణ్ తేజ్, హీరోయిన్ లావణ్య త్రిపాఠీ మ‌ధ్య ల‌వ్ ట్రాక్ న‌డుస్తుంద‌న్న వార్త‌లు గ‌త ఆరు నెల‌లుగా గుప్పుమంటున్నాయి. వీరి మ‌ధ్య సంథింగ్ సంథింగ్‌పై ఎన్ని వార్త‌లు వ‌స్తున్నా ఎవ్వ‌రూ స్పందించ‌డం లేదు. ఎవ‌రి ప‌నులు వారు చేసుకుంటున్నారు. మొన్నామ‌ధ్య లావ‌ణ్య త్రిపాఠి బ‌ర్త్ డే జ‌రిగిన‌ప్పుడు వ‌రుణ్ రు. కోటి డైమండ్ రింగ్‌తో బెంగ‌ళూరు వెళ్లి మ‌రీ ఆమెకు ప్ర‌పోజ్ చేయ‌బోతున్నాడ‌న్న వార్త బ‌య‌ట‌కు వ‌చ్చింది. అయితే ఆ రోజు లావ‌ణ్య హిమాచ‌ల్ ప్ర‌దేశ్లో త‌న ఫ్యామిలీతో ఎంజాయ్ చేస్తోన్న ఫొటో షేర్ చేసి ఈ వార్త‌ల‌కు చెక్ పెట్టేసింది.

అంత‌కుముందే ఆమె వ‌రుణ్ చెల్లి నిహారిక పెళ్లిలో చేసిన హ‌డావిడి మామూలుగా లేదు. రాజ‌స్థాన్‌లోని ఉద‌య్‌పూర్ ప్యాలెస్‌లో జ‌రిగిన ఈ పెళ్లికి మెగా ఫ్యామిలీకి చెందిన అతికొద్ది మంది స్నేహితులు మాత్ర‌మే హాజ‌ర‌య్యారు. హీరోయిన్ల‌కు ఎవ్వ‌రికి ఆహ్వానం లేదు. లావ‌ణ్య మాత్రం నిహారిక‌ను ద‌గ్గ‌రుండి మ‌రీ ముస్తాబు చేయ‌డంతో పాటు అక్క‌డ ఉపాస‌న‌తో పాటు అంతా తానే హంగామా చేసింది. అప్పుడే వీరిద్ద‌రి బంధం గురించి చాలా వార్త‌లు వ‌చ్చినా ఎవ్వ‌రూ స్పందించ‌క‌పోవ‌డంతో కాస్త సైలెంట్ అయ్యాయి.

అయితే తాజాగా వీరి ల‌వ్ ట్రాక్ నిజ‌మే అని.. వీరు పీక‌ల్లోతు ప్రేమ‌లో ఉన్నారంటూ మ‌ళ్లీ హింట్స్ వ‌స్తున్నాయి. వ‌రుణ్‌తేజ్ హీరోగా న‌టించిన గ‌ని సినిమా ఈ రోజు ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. ఈ సినిమాను అల్లు అర‌వింద్ త‌న‌యుడు అల్లు బాబి అత్యంత ప్ర‌తిష్టాత్మ‌కంగా నిర్మించారు. క‌న్న‌డ న‌టుడు ఉపేంద్ర కూడా న‌టించిన ఈ సినిమాపై ప్రి రిలీజ్ బ‌జ్ మామూలుగా లేదు. ఈ సినిమా రిలీజ్ నేప‌థ్యంలో లావ‌ణ్య గ‌ని టీంకు ఆల్ ద బెస్ట్ చెప్పింది.

అలాగే వ‌రుణ్‌తేజ్‌పై ప్ర‌శంస‌లు కురిపించింది. వ‌రుణ్ ఈ పాత్ర కోసం నువ్వు 110 శాతం ఎఫ‌ర్ట్ పెట్టావు.. నీతో పాటు నీ టీం చేసిన హార్డ్ వ‌ర్క్‌కు త‌గిన ప్ర‌తిఫ‌లం ద‌క్కాల‌ని తాను మ‌న‌స్ఫూర్తిగా ప్రార్థిస్తున్నా అంటూ ట్వీట్ చేసింది. ఈ ట్వీట్ ఇప్పుడు సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతోంది. ఈ ట్వీట్‌ను బ‌ట్టే సోష‌ల్ మీడియాలో ప‌లువురు నెటిజ‌న్లు లావ‌ణ్య‌.. వ‌రుణ్ అంటే ఎంత‌లా ఇష్ట‌ప‌డుతుందో ? తెలుస్తోంద‌ని కామెంట్ చేస్తున్నారు.

మ‌రోవైపు నాగ‌బాబు త‌న కొడుక్కి పెళ్లి చేసేస్తాన‌ని చెపుతున్నాడు. ఇటీవ‌ల కొంద‌రు నెటిజ‌న్లు నాగ‌బాబును వ‌రుణ్ – లావ‌ణ్య పెళ్లి గురించి అడిగితే మంచి సంబంధం ఉంటే చెప్పండి పెళ్లి చేస్తాను అని కూడా చెప్పాడు. ఏదేమైనా త్వ‌ర‌లోనే వీరి పెళ్లిపై క్లారిటీ వ‌చ్చే అవ‌కాశాలు ఉన్నాయి. మొత్తానికి లావ‌ణ్య మెగా ఫ్యామిలీ కోడ‌లు అయ్యే ఛాన్సులే క‌నిపిస్తున్నాయి.

 

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news