Movies' ఆచార్య ' ట్రైల‌ర్ ... మెగా ఫ్యాన్స్‌కు బిగ్ షాక్‌.....

‘ ఆచార్య ‘ ట్రైల‌ర్ … మెగా ఫ్యాన్స్‌కు బిగ్ షాక్‌.. ఇంత డిజ‌ప్పాయింటా…!

టాలీవుడ్ లెజెండరీ హీరో మెగాస్టార్ చిరంజీవి హీరోగా – కాజల్ అగర్వాల్ హీరోయిన్‌గా న‌టించిన మోస్ట్ అవైటెడ్ మూవీ ఆచార్య‌. చిరు న‌టించిన సైరా న‌ర‌సింహారెడ్డి త‌ర్వాత మూడేళ్ల‌కు పైగా గ్యాస్ తీసుకుని ఆచార్య చేశాడు. వాస్త‌వంగా ఆచార్య ఎప్పుడో స్టార్ట్ అయినా క‌రోనా కార‌ణంగాను.. ఇటు స‌రైన రిలీజ్ డేట్ లేక‌పోవ‌డంతో వాయిదాలు ప‌డుతూ వ‌స్తోంది. ఎట్ట‌కేల‌కు ఈ నెల 29న ఆచార్య థియేట‌ర్లలోకి వ‌స్తోంది.

ఇటు సినిమాలో చిరు త‌న‌యుడు రామ్‌చ‌ర‌ణ్‌, చ‌ర‌ణ్‌కు జోడీగా పూజా హెగ్డే న‌టిస్తుండ‌డంతో పాటు అస‌లు అప‌జ‌యం అన్న‌దే లేకుండా కొర‌టాల శివ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తుండ‌డంతో ఆచార్య‌పై భారీ అంచ‌నాలు ఉన్నాయి. ఈ మెగా మ‌ల్టీస్టార‌ర్ కోసం మెగా ఫ్యాన్స్ చాలా రోజుల నుంచి వెయిట్ చేస్తున్నారు. ఇక ట్రైల‌ర్ వ‌స్తుంద‌ని మేక‌ర్స్ కూడా కొద్ది రోజులుగా ఊరిస్తూ ఊరిస్తూ వ‌స్తున్నారు.

ఎట్ట‌కేల‌కు ఈ రోజు ఆచార్య ట్రైల‌ర్ వ‌చ్చేస్తుంద‌ని ఉద‌యం పోస్ట‌ర్ వేశారు. సాయంత్రం 4.59 గంట‌ల‌కు ట్రైల‌ర్ వ‌స్తుంద‌ని ఆర్భాటంగా ప్ర‌క‌ట‌న చేశారు. ఇంకేముంది. సాయంత్రం ట్రైల‌ర్ వ‌స్తుంద‌ని.. మెగాభిమానులు అంద‌రూ సోష‌ల్ మీడియాకు అతుక్కుపోయి ఉన్నారు. అయితే టైం అయ్యిందో లేదో వెంట‌నే ట్రైల‌ర్ పోస్ట్ పోన్ పోస్ట‌ర్ వేస్తూ అంద‌రికి పెద్ద షాక్ ఇచ్చారు.

ఈ పోస్ట‌ర్ బ‌య‌ట‌కు రావ‌డంతో మెగాభిమానులు ఒక్క‌సారిగా డిజ‌ప్పాయింట్ అయిపోయారు. అస‌లు ఆచార్య సినిమా కోస‌మే ఏకంగా మూడున్న‌రేళ్లుగా వెయిట్ చేస్తున్నారు. సినిమా కూడా ఊరించి ఊరించి వాయిదాలు ప‌డుతూ వ‌స్తోంది. స‌రే ఇప్ప‌ట‌కి అయినా రిలీజ్ అవుతోంది.. అప్ప‌టి వ‌ర‌కు ట్రైల‌ర్‌తో స‌రిపెట్టుకుందామ‌ని ఆశిస్తే ఇప్పుడు ట్రైల‌ర్‌ను కూడా ఈ నెల 12కు వాయిదా వేస్తున్న‌ట్టు చెప్పారు. మ‌రి ఆ రోజు అయినా ట్రైల‌ర్ వ‌స్తుందో ? లేదో ? చూడాలి.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news