Moviesవావ్‌... ఫ‌స్ట్ టైం ఎన్టీఆర్ కొడుకులు ఇద్ద‌రూ ఇంత ప‌బ్లిక్‌గా... (ఫొటో)

వావ్‌… ఫ‌స్ట్ టైం ఎన్టీఆర్ కొడుకులు ఇద్ద‌రూ ఇంత ప‌బ్లిక్‌గా… (ఫొటో)

టాలీవుడ్ యంగ్‌టైగ‌ర్ జూనియ‌ర్ ఎన్టీఆర్ ఫ్యామిలీ బ‌య‌ట పెద్ద‌గా క‌నిపించ‌దు. అటు సోష‌ల్ మీడియాలో మిగిలిన స్టార్ హీరోల భార్య‌లు, పిల్ల‌లు చాలా సార్లు హ‌డావిడి చేస్తూనే ఉంటారు. వారి ప‌ర్స‌న‌ల్ లైఫ్‌, ప‌బ్లిక్ లైఫ్‌కు సంబంధించిన ఫొటోలు, వీడియోలు, వ‌ర్క‌వుట్లు పోస్ట్ చేస్తూ ఉంటారు. అయితే ఎన్టీఆర్ భార్య ల‌క్ష్మీ ప్ర‌ణ‌తి, అమ్మ‌, ఎన్టీఆర్ ఇద్ద‌రు కుమారుల ఫోటోలు మాత్రం పెద్ద‌గా బ‌య‌ట‌కు రావు. ఆ మాట‌కు వ‌స్తే ఎన్టీఆర్ కూడా సోష‌ల్ మీడియాలో మ‌రీ అంత యాక్టివ్‌గా ఉండ‌డు. అన‌వ‌స‌ర విష‌యాల‌పై స్పందించ‌డు. తానేంటో త‌న ప‌నేంటో చూసుకునేందుకే ఎక్కువుగా ప్ర‌యార్టీ ఇస్తాడు.

అయితే ఈ రోజు ఎన్టీఆర్ కుటుంబం తిరుమ‌ల శ్రీవారి సేవ‌లో త‌రించింది. మంగ‌ళ‌వారం ఉద‌య‌మే వీఐపీ ద‌ర్శ‌నం టైంలో ఎన్టీఆర్ త‌ల్లి షాలినితో పాటు భార్య ల‌క్ష్మీ ప్ర‌ణ‌తి, ఇద్ద‌రు కుమారులు అభయ్ రామ్ – భార్గవ్ రామ్ శ్రీవారి సేవలో పాల్గొన్నారు. వీరికి ద‌ర్శ‌నం అనంత‌రం శ్రీవారి ఆల‌య అర్చ‌కులు తీర్థ ప్ర‌సాదాలు అందించారు. ఎన్టీఆర్ కుటుంబ స‌మేతంగా శ్రీవారి ఆల‌యానికి రావ‌డం.. వాళ్లు బ‌య‌ట‌కు వ‌చ్చాక ఫొటో గ్రాఫ‌ర్లు అభిమానులు ఒక్క‌సారిగా ఫోటోలు తీయ‌డంలో అవి బ‌య‌ట వైర‌ల్ అవుతున్నాయి.

ఈ ఫొటో బ‌య‌ట‌కు వ‌చ్చిన‌ప్ప‌టి నుంచి సోష‌ల్ మీడియాలో ఒక్క‌టే వైర‌ల్ అవుతోంది. ఎన్టీఆర్ ఫ్యాన్స్ విప‌రీతంగా షేర్లు చేయ‌డంతో పాటు కామెంట్లు కూడా చేస్తున్నారు. ఇక ఎన్టీఆర్ త్రిబుల్ ఆర్ ప్ర‌మోష‌న్లలో బిజీగా ఉండ‌డంతో రాలేద‌ని అంటున్నారు. ఇక తిరుప‌తి ఎన్టీఆర్ అభిమానులు కొంద‌రు ద‌గ్గ‌రుండి మ‌రీ వీరి ద‌ర్శ‌న ఏర్పాట్లు చూశారు. ఎన్టీఆర్ ద‌ర్శ‌క‌ధీరుడు రాజ‌మౌళి ద‌ర్శ‌క‌త్వంలో న‌టించిన త్రిబుల్ ఆర్ ఈ నెల 25న ప్ర‌పంచ వ్యాప్తంగా రిలీజ్ కానుంది .

త్రిబుల్ ఆర్ ప్ర‌మోష‌న్లు అయిపోయిన వెంట‌నే ఎన్టీఆర్ కొర‌టాల శివ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కే సినిమా షూటింగ్‌లో బిజీ కానున్నాడు. యువ‌సుధా ఆర్ట్స్ – ఎన్టీఆర్ ఆర్ట్స్ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నాయి. ఈ సినిమాలో ఎన్టీఆర్ స‌ర‌స‌న అలియా భ‌ట్ హీరోయిన్‌గా ఎంపికైన‌ట్టే..! ఇక పాన్ ఇండియా రేంజ్లో ఈ సినిమాను తెర‌కెక్కించే ప్ర‌య‌త్నాలు జ‌రుగుతున్నాయి.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news