Moviesబన్నీ డైరెక్టర్ తో కుర్ర హీరోయిన్ శ్రీలీల.. బంపర్ ఆఫర్ కొట్టేసిందిగా..?

బన్నీ డైరెక్టర్ తో కుర్ర హీరోయిన్ శ్రీలీల.. బంపర్ ఆఫర్ కొట్టేసిందిగా..?

శ్రీలీల.. ఒక్కే ఒక్క సినిమాతో తన భవిష్యత్తు ని మార్చేసుకుంది సినిమా ఓ రేంజ్ లో హిట్ కూడా కాలేదు. జస్ట్ యావరేజ్ టాక్..అయినా కానీ అమ్మడు అందాల ఆరబోతను చూసిన జనాలు కుర్ర బ్యూటీకి ఫిదా అవుతున్నారు. ఇక ఈ సినిమా లో మెయిన్ హైలైట్ గా నిలిచింది హీరోయిన్ శ్రీలీల. అందం అభినయం తో పాటు ఆమె తన నటన తోనూ ప్రేక్షకులను ఎంతగానో మెప్పించింది. చక్కని లుక్స్ తో క్యూట్ క్యూట్ ఎక్స్ ప్రెషన్స్ తో ఆమె ప్రేక్షకులను కూడా ఎంతగానో ఫిదా చేసింది

పెళ్లిసంద‌డ్ సినిమాలో హీరోయిన్‌గా న‌టించిన శ్రీలీల ఇప్పుడు టాలీవుడ్‌లో స్టార్ హీరోయిన్ ర్యాంకు కోసం దూసుకుపోతోంది. ‘పెళ్లి సందడ్’ అనే సినిమాతో ఓవర్ నైట్ స్టార్ గా మారిపోయి.. టాప్ హీరోయిన్ల లిస్ట్ లో చేరిపోయింది. ఈ సినిమా రిలీజ్ అయ్యేవరకు ఈమె పేరుకూడా తెలియదు. కానీ, ఈ సినిమా తరువాత..ఈమె దర్శక నిర్మాతల పాలిట అదృష్ట దేవతగా మారిపోయింది. రవితేజ హీరోగా డైరెక్టర్ త్రినాధరావు నక్కిన కాంబోలో తెరకెక్కిస్తున్న సినిమా ధమాకా మూవీలో = పెళ్లి సందడ్ ఫేమ్ శ్రీలీల హీరోయిన్‏గా నటిస్తుంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్స్ మూవీపై క్యూరియాసిటీని పెంచాశాయి. ప్రస్తుతం రవితేజ, శ్రీలీలపై ఓ పాటను ప్లాజా డి ఎస్పానా అనే హిస్టారికల్ లొకేషన్లో చిత్రీకరిస్తున్నారు.

కాగా అమ్మడికి ఓ బడా డైరెక్టర్ అద్దిరిపోయే ఆఒహర్ ను ఇచ్చిన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే సూపర్ స్టార్ మహేష్ బాబు త్రివిక్రమ్ కాంబినేషన్ లో రానున్న సినిమాలో శ్రీలీల సెకండ్ హీరోయిన్ గా నటిస్తుందని వార్తలు వైరల్ అవుతున్నాయి. ఇదే టైంలో ఈ చిన్నదానికి మరో క్రేజీ ఆఫర్ వచ్చిందని తెలుస్తుంది. రైటర్ కమ్ డైరెక్టర్ వక్కంతం వంశీ దర్శకత్వం వహిస్తున్న తన నెక్స్ట్ సినిమాలో శ్రీలీల ను హీరోయిన్ గా సెలక్ట్ చేసుకున్నారట. ఈ సినిమా కోసం అమ్మడు కోటి రూపాయల పైనా పారితోషకం అడిగినా..ఆయన సై అంటూ ఆమె దగ్గర ప్రాజెక్ట్ కి సైన్ కూడా చేయించుకున్నారట. అల్లు అర్జున్ నటించిన నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా సినిమా ఫ్లాప్ అయిన తరువాత.. వక్కంతం వంశీ చేస్తున్న ప్రాజెక్ట్ ఇదే కావడం గమనార్హం. మరి ఈ సినిమాతోనైన ఈ డైరెక్టర్ హిట్ కొడతాడా..లేదో చూడాలి..?

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news