Moviesఆ హీరోయిన్ తో నిశ్చితార్ధం ..సైలెంట్ షాకిచ్చిన ఆది పినిశెట్టి...

ఆ హీరోయిన్ తో నిశ్చితార్ధం ..సైలెంట్ షాకిచ్చిన ఆది పినిశెట్టి…

ఆది పినిశెట్టి..పేరుకు ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఓ వైపు హీరోగా రాణిస్తూనే మరోవైపు విలన్ గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఆకట్టుకుంటున్నారు ఆది పినిశెట్టి. బడా బడా హీరోలు కూడా తమ సినిమాల్లో ఆది ఉండేటట్లు ప్లాన్ చేసుకుంటున్నారంటేనే ఆయన ఫాలోయింగ్ అర్ధమైపోవాలి. ఆది పినిశెట్టి కి మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఆయన ఏ సినిమా లో నటించిన అది ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. అలాంటి పాత్రలు చూస్ చేసుకుంటారు ఆయన.

కాగా, ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీ గా ఉన్న ఈయన త్వరలోనే పెళ్ళి పీఠలు ఎక్కబోతున్నట్లు తెలుస్తుంది. ఆయన సన్నిహుతుడు ఒకరు మీడియాకి కి తెలిపిన వువారాలు ప్రకారం..గత కొంత కాలంగా హీరోయిన్ నిక్కీ గ‌ల్రానీ తో పీకల్లోతు ప్రేమలో ఉన్నాడట. ఈ అమ్మడు తెలుగు ప్రేక్ష‌కులకు పరిచ‌య‌మున్న ముఖ‌మే. ఈమె ‘కృష్ణాష్ట‌మి’, ‘మ‌లుపు’, ‘మ‌ర‌క‌త‌మ‌ని’ సినిమాల‌తో తెలుగు ప్రేక్ష‌కుల‌ను ఆక‌ట్టుకుంది. అంతేకాదు బుజ్జిగాడు’ ఫేం సంజ‌న గ‌ల్రానీ కి ఈమె స్వయాన చెల్లెలు. పోలికలు చూస్తే ఇట్టే గుర్తుపట్టెస్తారు.

వీళ్లిద్దరు కలిసి మ‌లుపు అనే సినిమా చేశారు. ఆ సినిమా షూటింగ్ టై లో వీళ్ళ మనసు లు దగ్గరైయాయని.. వీళ్ళీద్దరూ ప్రేమలో పడారని.. కొన్నేళ్ళుగా డేటింగ్ చేస్తున్న..ఈ జంట ఫైనల్ గా పెళ్ళి చేసుకోవాలని డిసైడ్ అయ్యాతట. వీరి ప్రేమకి పెద్దలు కూడా గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో ఈ జంట ఒకటి కానుందట.

ప్రస్తుతం వీరిద్దరి నిశ్చితార్థానికి సంబంధించిన ప‌నులు జ‌రుగుతున్నాయని, త్వర‌లోనే పెళ్ళి కూడా ఫిక్స్ కానుందని తెలుస్తోంది.కాగా..ఆది పినిశెట్టి.. ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని ప్రధాన పాత్రలో నటిస్తోన్న ఋఆఫో19 ఓ కీలక రోల్ చేయనున్నాడు. ఈ సినిమాకు తమిళ్ డైరెక్టర్ లింగుస్వామి దర్శకత్వం వహిస్తున్నారు. తెలుగు, తమిళ్ భాషల్లో తెరకెక్కుతున్న ఈ మూవీలో ఉప్పెన బ్యూటీ కృతి శెట్టి హీరోయిన్‏గా నటిస్తోంది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news