Moviesక‌ళ్యాణ్‌రామ్‌పై ఆ స్టార్ డైరెక్ట‌ర్ చెక్కు చెద‌ర‌ని ప్రేమ‌... ఆ హిట్...

క‌ళ్యాణ్‌రామ్‌పై ఆ స్టార్ డైరెక్ట‌ర్ చెక్కు చెద‌ర‌ని ప్రేమ‌… ఆ హిట్ సినిమాకు సీక్వెల్ ఫిక్స్‌..!

అనిల్ రావిపూడి ఇప్పుడు తెలుగు సినిమా చ‌రిత్ర‌లో స్టార్ డైరెక్ట‌ర్ల‌లో ఒక‌రు. అనిల్ రావిపూడి వ‌రుస పెట్టి స్టార్ హీరోల‌తో సినిమాలు చేసుకుంటూ వెళ్లిపోతున్నాడు. ఎఫ్ 2, స‌రిలేరు నీకెవ్వ‌రు, ఇప్పుడు ఎఫ్ 3, ఆ త‌ర్వాత బాల‌య్య‌తో ఓ సినిమా ఇలా చాలా స్ట్రాంగ్ లైన‌ఫ్ అనిల్ రావిపూడికి ఉంది. అస‌లు అనిల్ రావిపూడి జ‌ర్నీ ఎక్క‌డ స్టార్ట్ అయ్యింద‌ని ఓసారి వెన‌క్కు తిరిగి చూసుకుంటే ప‌టాస్‌తో..!

2015లో ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యాన‌ర్లో వ‌చ్చిన ప‌టాస్ సినిమా సూప‌ర్ హిట్ అయ్యింది. చాలా రోజుల త‌ర్వాత క‌ళ్యాణ్‌రామ్ కెరీర్‌లో ఇది బ్లాక్‌బ‌స్ట‌ర్‌. ప‌లు కేంద్రాల్లో 50 రోజుల‌తో పాటు శ‌త‌దినోత్స‌వం కూడా జ‌రుపుకుంది. ఆ త‌ర్వాత వ‌రుస హిట్ల‌తో స్టార్ డైరెక్ట‌ర్ అయిపోయాడు. ప‌టాస్‌కు ఇప్ప‌ట‌కీ అనిల్ రావిపూడి ఇమేజ్ ప‌ది రెట్లు పెరిగిపోయింది.

దీంతో త‌న‌కు డైరెక్ట‌ర్‌గా తొలి ఛాన్స్ ఇచ్చిన అనిల్ రావిపూడితో సినిమా చేయ‌క‌పోవ‌చ్చ‌నే ప్ర‌చారం న‌డిచింది. అయితే దీనిపై అనిల్ స్పందించాడు. తాను ఎంత ఎత్తుకు వెళ్లినా.. ఎంత బిజీగా ఉన్నా క‌ళ్యాణ్‌రామ్‌ను తాను ఎప్ప‌ట‌కీ మ‌ర్చిపోన‌ని చెప్పాడు. త‌న తొలి హీరో క‌ళ్యాణ్‌రామ్‌తో ప‌టాస్ – 2 చేస్తాన‌ని ప్ర‌క‌టించాడు. ప‌టాస్ త‌ర్వాతే తాము మ‌రోసారి క‌లిసి ప‌ని చేయాల‌ని అనుకున్నామ‌ని చెప్పాడు.

సైన్స్ ఫిక్ష‌న్ బ్యాక్‌డ్రాప్‌లో కూడా తాను ఓ క‌థ చెప్పాన‌ని.. నా మూడో సినిమా క‌ళ్యాణ్‌రామ్‌తో చేయాల‌ని అనుకున్నా.. కుద‌ర్లేద‌ని అనిల్ తెలిపాడు. తామిద్ద‌రం మంచి స్లాట్ చూసుకుని ప‌టాస్ – 2 చేస్తామ‌ని అన్నాడు. త‌న‌కు క‌ళ్యాణ్‌రామ్‌కు ఎప్పుడు గ్యాప్ రాలేద‌ని.. ప‌టాస్ హిట్ అయ్యాక‌.. తాము స‌క్సెస్ టూర్ చేసిన టైంలో తాము మ‌రింత క‌లిసిపోవ‌డంతో.. త‌మ మ‌ధ్య మ‌రింత బాండింగ్ పెరిగింద‌ని చెప్పాడు.

మొన్న క‌ళ్యాణ్‌రామ్ వివాహ వార్షికోత్స‌వానికి కూడా తాను ఫోన్ చేసి విష్ చేశాన‌ని.. త‌మ మ‌ధ్య బంధం ఎప్ప‌ట‌కీ అలాగే ఉంటుంద‌ని చెప్పాడు. ప్ర‌స్తుతం ఇటు క‌ళ్యాణ్‌రామ్ కూడా బింబిసార‌, డెవిల్ సినిమాల‌తో బిజీగా ఉన్నాడు. ఆ త‌ర్వాత ఎప్పుడు కుదిరితే అప్పుడు ప‌టాస్ 2 ఉండొచ్చు. ఏదేమైనా తాను ఎంత స్టార్ డైరెక్ట‌ర్‌గా ఉన్నా కూడా అనిల్ రావిపూడి త‌న తొలి సినిమా హీరోను మ‌ర్చిపోలేదు.. ఆ ప్రేమ ఎప్ప‌ట‌కీ అలాగే ఉంద‌ని చెప్ప‌క‌నే చెప్పాడు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news