Moviesనాగబాబు అల్లుడికి ఎన్ని కోట్లు కట్నంగా ఇచ్చాడో తెలుసా..ఏ మెగాడాటర్ కి...

నాగబాబు అల్లుడికి ఎన్ని కోట్లు కట్నంగా ఇచ్చాడో తెలుసా..ఏ మెగాడాటర్ కి కూడా ఇంత ఇవ్వలేదట..!!

టాలీవుడ్ లో మెగా బ్రదర్స్ అంటే అందరికి గుర్తు వచ్చేది..చిరంజీవి,నాగ బాబు,పవన్ కళ్యాణ్. ముగ్గురు కూడా సినీ ఇండస్ట్రీలో తమ దైన స్టైల్ లో సినిమాలు చేస్తూ మెప్పిస్తున్నారు. అయితే వీళ్ల వార్సత్వంగా సినీ ఇండస్ట్రీలోకి ఇప్పటి వరకు మెగా హీరోలు వచ్చారు కానీ.. మెగా ఫ్యామిలీ నుంచి వచ్చిన ఏకైక హీరోయిన్ మాత్రం…. నాగబాబు కుమార్తె నిహారిక. అయితే ఎన్నో ఆశలతో ఇండస్ట్రీలోకి హీరోయిన్ గా అడుగు పెట్టినా..అమె మాత్రం అంతగా ఆకట్టుకోలేకపోయారు.

‘ఒకే మనసు’సినిమాతో మొదటి సారిగా మెగాబ్రదర్ కూతురు కొణిదెల నిహారిక హీరోయిన్ గా పరిచయం అయ్యింది. ఈ సినిమా బాక్స్ ఆఫిస్ వద్ద డిజాస్టర్ టాక్ ను సొంతం చేసుకుంది. ఆ తరువాత మూడు రెండు మూడు సినిమాలు చేసింది. అవి అట్టర్ ఫ్లాప్ గా నిలిచాయి. దీంతో మెగా ఫ్యామిలీ అభిమానుల సపోర్ట్ ఆమెకు ఏమాత్రం లేకుండా పోయింది. ఇక ఇవి వర్క్ అవుట్ అవ్వవు అనుకునిందో ఏమో కానీ..ఫైనల్ గా గుంటూరు మాజీ ఐజీ జొన్నల గడ్డ ప్రభాకర్ రావు కుమారుడు చైతన్యను పెళ్లి చేసుకుని..జొన్నల గడ్డ ఇంటికి కొడలుగా సెటిల్ అయిపోయింది.

వీళ్ళ పెళ్లి అంగరంగ వైభవంగా జరిగిన సంగతి తెలిసిందే. అబ్బో పెళ్లికి ముందు నుండే ఈ జంట చేసిన హడావుడి అంతా ఇంతా కాదు.. ఓ రేంజ్ లో ఎంజాయ్ చేసారులే. ఆ పాటలు, ఆ డ్యాన్సులు..ఒకటా రెండా బోలెడు ఫంక్షన్ లు..ప్రతి ఫంక్షన్ లో తళ్లుకుమన్న మెగా హీరోలు వాళ్ళు చేసిన అల్లరి సందడి..చూడటానికి మనకు ఎలా ఉన్నా వాళ్ళ అమ్మయి పెళ్ళిలో వాళ్ళు బాగా ఎంజాయ్ చేసారు.

అయితే, నీహారిక పెళ్లికి చాలా ఖరీదైన బహుమతులు వచ్చాయట. పెళ్లి వేడుక రోజు.. పెళ్లికూతురు నిహారికకు మెగాస్టార్ చిరంజీవి ఓ వజ్రాల హారాన్ని బహుమతిగా ఇచ్చారు. ఆ వజ్రాల హారం ధర ఏకంగా రెండు కోట్ల రూపాయలు. ఇక వరుణ్ తేజ్ కూడా తన చెల్లెలి కోసం రెండు కోట్ల రూపాయల విలువైన ప్లాట్ ను బహుమతిగా ఇచ్చాడు. అలాగే బాబాయ్ పవన్ సైతం ఖరీదైన కారును బహుమతిగా ఇచ్చాడట.

 

ఇక నాగబాబు.. తన అల్లుడికి ఎంతో గారభంగా పెంచుకున్న కూతురు నిహారికతో పాటు కట్నాలు బాగానే ముట్టజెప్పినట్టు తెలుస్తుంది. డైరెక్ట్‌గా పెళ్లి కొడుకుకు కాకుండా.. నిహారికకు దాదాపు రూ. 10 కోట్ల వరకు లాంఛనం ఇచ్చారట. మరోవైపు పెళ్లికి నగలు నట్రా అవన్ని కలిపి మరో రూ. 2 కోట్ల రూపాయిలు అయ్యాయట. అంతేకాదు నిహారిక పేరు మీద ఓ బంగ్లాను కూడా అల్లుడికి ఇచ్చిన్నట్లు సమాచారం. మొత్తంగా కట్నం అన్న పేరు రాకుండానే నాగబాబు తన అల్లుడికి కోట్లు విలువ చేసే ప్రాపర్టీలు ఇచ్చారనమాట.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news