Moviesవావ్‌... బుచ్చిబాబు సినిమాలో ఎన్టీఆర్ క్యారెక్ట‌ర్ ఇదే..!

వావ్‌… బుచ్చిబాబు సినిమాలో ఎన్టీఆర్ క్యారెక్ట‌ర్ ఇదే..!

టాలీవుడ్ యంగ్‌టైగ‌ర్ ఎన్టీఆర్ ఇప్ప‌టికే వ‌రుస‌గా ఐదు హిట్ల‌తో ఉన్నాడు. ప్ర‌స్తుతం రాజ‌మౌళి ద‌ర్శ‌క‌త్వంలో ఎన్టీఆర్ న‌టిస్తోన్న త్రిబుల్ ఆర్ సినిమా మార్చి 25న రిలీజ్ అవుతోన్న సంగ‌తి తెలిసిందే. రు. 450 కోట్ల భారీ బ‌డ్జెట్‌తో తెర‌కెక్కిన ఈ సినిమాలో మ‌రో టాలీవుడ్ హీరో రామ్‌చ‌ర‌ణ్ కూడా న‌టిస్తున్న సంగ‌తి తెలిసిందే. బాహుబ‌లి త‌ర్వాత రాజ‌మౌళి తెర‌కెక్కించిన ఈ సినిమాపై భారీ అంచ‌నాలు ఉన్నాయి. త్రిబుల్ ఆర్ త‌ర్వాత ఎన్టీఆర్ లైన‌ప్‌లో అన్నీ క్రేజీ ప్రాజెక్టులే ఉన్నాయి. ప్ర‌స్తుతం కొర‌టాల శివ సినిమా చేస్తున్నాడు.

ఈ సినిమాను మిక్క‌లినేని సుధాక‌ర్‌తో పాటు ఎన్టీఆర్ సోద‌రుడు క‌ళ్యాణ్‌రామ్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ సినిమా త‌ర్వాత ఉప్పెన ద‌ర్శ‌కుడు బుచ్చిబాబు సానా ద‌ర్శ‌క‌త్వంలో ఓ సినిమాకు ఓకే చెప్పాడు. ఆ త‌ర్వాత మాట‌ల మాంత్రికుడు త్రివిక్ర‌మ్ సినిమా కూడా ఉంది. ఇక బుచ్చిబాబు సానా అయితే ఉప్పెన త‌ర్వాత ఎన్ని ఆఫ‌ర్లు వ‌చ్చినా ఎన్టీఆర్ సినిమా కోస‌మే వెయిట్ చేస్తున్నాడు. చేస్తే తాను ఎన్టీఆర్‌తోనే ముందుగా సినిమా చేయాల‌న్న పంతంతో ఉన్నాడు.

ఉప్పెన రిలీజ్ అయిన‌ప్ప‌టి నుంచి ఎన్టీఆర్ సినిమా కోస‌మే వ‌ర్క్ చేస్తున్నాడు. కొర‌టాల సినిమా ముగిసిన వెంట‌నే ఎన్టీఆర్ – బుచ్చిబాబు సినిమా ఉంటుంది. అప్ప‌టి వ‌ర‌కు బుచ్చిబాబు మ‌రో సినిమా చేసేందుకు కూడా ఇష్ట‌ప‌డ‌డం లేదు. ఈ సినిమాకు సంబంధించి ఓ ఇంట్ర‌స్టింగ్ అప్‌డేట్ బ‌య‌ట‌కు వ‌చ్చింది. స్పోర్ట్స్ డ్రామాగా తెర‌కెక్కే ఈ సినిమాలో ఎన్టీఆర్ క‌బ‌డ్డీ ప్లేయ‌ర్‌గా క‌నిపిస్తాడ‌ట‌. గ్రామీణ వాతావ‌ర‌ణం నేప‌థ్యంలో తెర‌కెక్కే ఈ సినిమాలో కొంత పార్ట్ ఉత్త‌రాంధ్ర‌లోని విజ‌య‌న‌గ‌రం బ్యాక్‌డ్రాప్‌లో ఉంటుంద‌ని తెలుస్తోంది.

ప‌రువు నేప‌థ్యంలో ఉప్పెన సినిమాను తెర‌కెక్కించిన బుచ్చిబాబు ఇప్పుడు స్పోర్ట్స్ నేప‌థ్యంలో ఎన్టీఆర్ సినిమాను డీల్ చేయ‌డం అంటే అంద‌రిలోనూ కాస్త ఆస‌క్తి ఉంది. పైగా రెండో సినిమాతోనే ఎన్టీఆర్ లాంటి పెద్ద హీరోతో సినిమా అంటే మామూలు విష‌యం కాదు. ఇక మైత్రీ మూవీస్ వారు భారీ బ‌డ్జెట్‌తో ఈ సినిమాను నిర్మిస్తున్నారు. మార్చిలో కొర‌టాల – ఎన్టీఆర్ సినిమా షూటింగ్ స్టార్ట్ అవుతుంది. అది పూర్త‌య్యాకే బుచ్చిబాబు సానా సినిమా ఉంటుంది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news