Moviesడీజే టిల్లు ' ఫ‌స్ట్ వీక్ క‌లెక్ష‌న్లు కుమ్మేసుకుందిగా.. ఎన్ని కోట్లు...

డీజే టిల్లు ‘ ఫ‌స్ట్ వీక్ క‌లెక్ష‌న్లు కుమ్మేసుకుందిగా.. ఎన్ని కోట్లు అంటే..!

చాలా చిన్న సినిమాగా రిలీజ్ అయిన సిద్ధు జొన్న‌ల‌గ‌డ్డ డీజే టిల్లు సినిమా బాక్సాఫీస్ ద‌గ్గ‌ర వ‌సూళ్ల విష‌యంలో మాత్రం అంద‌రి అంచ‌నాలు త‌ల్ల‌కిందులు చేసేసింది. సితార ఎంట‌ర్టైన్‌మెంట్ బ్యాన‌ర్‌ఫై తెర‌కెక్కిన ఈ సినిమా నైజాంలో తొలి రోజే బ్రేక్ ఈవెన్ అయ్యి ట్రేడ్ వ‌ర్గాల‌కు, సినిమా ఇండ‌స్ట్రీకి పెద్ద షాక్ ఇచ్చింది. ఓ వైపు మాస్‌మ‌హ‌రాజ్ ర‌వితేజ న‌టించిన ఖాలాడి సినిమా భారీ అంచ‌నాల‌తో రిలీజ్ అయ్యింది. ఆ మ‌రుస‌టి రోజే డీజే టిల్లు రావ‌డం పెద్ద సాహ‌స‌మే.

తొలి షోకే మంచి టాక్ సొంతం చేసుకుని.. యూత్ మెచ్చే సినిమాగా ప్ర‌శ‌సంలు అందుకున్న టిల్లు ఫ‌స్ట్ వీక్ ముగిసే స‌రికి వ‌ర‌ల్డ్ వైడ్‌గా రు 12.56 కోట్ల వ‌సూళ్లు రాబ‌ట్టింది. ఇది మామూలు సంచ‌ల‌నం కాదు. ఈ సినిమాకు రు. 9 కోట్ల చిల్ల‌ర ప్రి రిలీజ్ బిజినెస్ జ‌రిగింద‌ని ట్రేడ్ టాక్‌. ఇక ప‌వ‌న్ క‌ళ్యాణ్ – రానా భీమ్లా నాయ‌క్ వ‌చ్చే వ‌ర‌కు ఈ సినిమాకు బాక్సాఫీస్ ద‌గ్గ‌ర పోటీ లేదు. దీంతో ఈ వీకెండ్‌లో కూడా టిల్లు కలెక్ష‌న్లు కుమ్మేసుకోనుంది.

యూత్ ఈ సినిమా బాగా ఎంజాయ్ చేస్తుండ‌డంతో పాటు ఏ సెంట‌ర్ల‌లో, మ‌ల్టీఫ్లెక్సుల్లో మంచి వ‌సూళ్లు వ‌స్తున్నాయి. ఓ వైపు ర‌వితేజ ఖిలాడి ఆల్‌మోస్ట్ డిజాస్ట‌ర్ కావ‌డంతో టిల్లు దూకుడుకు బ్రేకుల్లేవు. ఓ సారి ఏరియాల వారీగా ఈ సినిమా వ‌సూళ్లు ఇలా ఉన్నాయి.

నైజాం – 5.66 కోట్లు
సీడెడ్ – 1.45 కోట్లు
ఉత్త‌రాంధ్ర – 1.02 కోట్లు
ఈస్ట్ – వెస్ట్ – 1.26 కోట్లు
కృష్ణా – గుంటూరు – 1.03 కోట్లు
ఓవ‌ర్సీస్ – 1.79 కోట్లు
రెస్టాఫ్ ఇండియా – 1.35 కోట్లు
—————————————
వ‌ర‌ల్డ్ వైడ్ షేర్ = 12.56 కోట్లు
————————————-

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news