Moviesవిజయ్ దేవరకొండ పిరికిడివాడే..హీరోయిన్ సెన్సేషనల్ కామెంట్స్..!!

విజయ్ దేవరకొండ పిరికిడివాడే..హీరోయిన్ సెన్సేషనల్ కామెంట్స్..!!

టాలీవుడ్ సెన్సెషనల్ హీరో విజయ్‌ దేవరకొండ..ఈ పేరుకు ఉన్న రేంజ్ క్రేజ్ గురించి ఎంత చెప్పినా తక్కువే. ఇండస్ట్రీకి వచ్చిన అతి తక్కువ టైంలోనే స్టార్ హీరోల స్దాయిలో ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్నాడు. పెళ్లిచూపులు సినిమాతో పరిచయమైన ఈ యంగ్ హీరో ఆతర్వాత అర్జున్ రెడ్డి సినిమాతో సంచలన విజయాన్ని సొంతం చేసుకున్నాడు. సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో వచ్చిన అర్జున్ రెడ్డి మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. ఈ సినిమాతో ఓవర్ నైట్ లో స్టార్ హీరో క్రేజ్ సొంతం చేసుకున్నాడు. ఇక ఈ సినిమా తరువాత విజయ్ పాపులారిటీ పెరిగింది. బడా బడా హీరోల కూతుర్లు కూడా విజయ్ కి ఫ్యాన్స్ అంటే ఆయన రేంజ్ ఎలా ఉందో మనం అర్ధం చేసుకోవచ్చు.

ప్రస్తుతం విజయ్ డైనమిక్ డైరెక్టర్ పూరి జగన్నాధ్ డైరెక్షన్ లో లైగర్ అనే సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. పాన్ ఇండియా రేంజ్ లో తెరకెక్కుతున్న ఈ మూవీలో బాలీవుడ్ బ్యూటీ అనన్య పాండే హీరోయిన్‌గా నటిస్తుంది. హై ఓల్టేజ్ యాక్ష‌న్ ఎంట‌ర్టైన‌ర్ గా పూరీ జగన్నాథ్ తనదైన స్టైల్లో విభిన్న రీతిలో తెరకెక్కిస్తున్నారు. ఇక ఈ సినిమాను ధ‌ర్మ ప్రొడ‌క్ష‌న్‌, పూరి క‌నెక్ట్స్ ప‌తాకంపై క‌ర‌ణ్ జోహ‌ర్‌-పూరి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ సిన‌మాలో బాక్సింగ్ లెజెండ్ మైక్ టైస‌న్ కూడా ఓ కీల‌క పాత్ర‌లో క‌నిపించ‌నున్నాడు. షూఊతీంగ్ కంప్లీట్ చేసుకున్న ఈ సినిమా అతి త్వరలోనే మన ముందుకు రానుంది.

అయితే , ఈ సినిమాలో హీరోయిన్ గా నటించిన అనన్య రీసెంట్ గా రొమాంటిక్ మూవీ ‘గెహ్రయాన్’ లో కూడా నటించి బ్లాక్ బస్టర్ హిట్ ను తన ఖాతాలో వేసుకుంది. ఈ సినిమా సక్సెస్ లో భాగంగా ఓ ఇంతర్వ్యుల్లో మాట్లాడుతూ..హీరో విజయ్ దేవరకొండ పై షాకింగ్ కామెంట్స్ చేసింది.

మనం ఏదైన సినిమా లో నటించే సమయంలో ఓ కోస్టార్ నుంచి ఎలాంటి కంఫర్ట్స్ కోరుకుంటామో.. అలాంటి క్వాలిటీస్ అన్నీ అన్నీ విజయ్ దేవరకొండలో ఉన్నాయంటూ చెప్పుకొచ్చిన ఈ బ్యూటీ.. సినిమాల్లో ఉండేదానికి పూర్తి భిన్నంగా విజయ్ బయట ఉన్నాడని.. అది నిజంగా తనకు ఆశ్చర్యం కలిగించిందని చెప్పుకొచ్చింది అనన్య పాండే. అతడు పిరికివాడు అంటూ కామెంట్ చేసింది అనన్య. అయితే విజయ్ దేవరకొండ బెస్ట్ కో స్టార్ అంటూ కితాబిచ్చింది ఈ ముద్దుగుమ్మ.ఆయన నటించిన ‘అర్జున్ రెడ్డి’ సినిమా చూశానని, ఆ మూవీ చాలా నచ్చిందని చెప్పుకొచ్చింది. ప్రస్తుతం అనన్య విజయ్ పై చేసిన కామెంట్స్ వైరల్ గా మారాయి.

 

 

 

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news