Moviesవ‌రుణ్‌తేజ్‌తో పెళ్లి... ఇన్‌స్టా వేదిక‌గా క్లారిటీ ఇచ్చేసిన లావ‌ణ్య త్రిపాఠి

వ‌రుణ్‌తేజ్‌తో పెళ్లి… ఇన్‌స్టా వేదిక‌గా క్లారిటీ ఇచ్చేసిన లావ‌ణ్య త్రిపాఠి

గ‌త రెండు రోజులుగా సోష‌ల్ మీడియాను మెగా హీరో వ‌రుణ్ తేజ్‌, లావ‌ణ్య త్రిపాఠి ఎఫైర్ న్యూస్ ఓ ఊపు ఊపేసింది. వ‌రుణ్ రు. 30 ల‌క్ష‌ల డైమండ్ రింగ్ తీసుకుని బెంగ‌ళూరు వెళ్లాడ‌ని.. అక్క‌డ లావ‌ణ్య‌కు ప్ర‌పోజ్ చేయ‌బోతున్నాడంటూ ఒక వార్త గుప్పుమంది. వీరిద్ద‌రు పెళ్లి పీట‌లు కూడా ఎక్కేయ‌బోతున్నార‌న్న ప్ర‌చారం బాగా వైర‌ల్ అయ్యింది. గ‌తంలో వీరిద్ద‌రు క‌లిసి మిస్ట‌ర్ – అంత‌రిక్షం సినిమాల్లో న‌టించారు. ఇందులో మిస్ట‌ర్ సినిమా డిజాస్ట‌ర్‌. అంత‌రిక్షం జ‌స్ట్ ఓకే.

లావ‌ణ్య తెలుగులో చాలా సినిమాలు చేసినా ఆమెకు అనుకున్న స్థాయిలో స్టార్ హీరోయిన్ రేంజ్ అయితే రాలేదు. అయితే వ‌రుణ్‌తో ఆమె చేసిన రెండు సినిమాల టైంలోనే వారిద్ద‌రు ప్రేమ‌లో ప‌డ్డార‌ని.. ఇప్ప‌టి వ‌రకు సీక్రెట్‌గా కొన‌సాగిన వీరి ప్రేమను పెద్ద‌ల‌ను ఒప్పించి పెళ్లి వ‌ర‌కు తీసుకు వెళుతున్నార‌న్న ప్ర‌చార‌మే ఎక్కువుగా జ‌రిగింది. దీనికి తోడు వ‌రుణ్ తేజ్ చెల్లి నిహారిక పెళ్లిలో లావ‌ణ్య హ‌ల్‌చ‌ల్ చేయ‌డంతో వీరు ప్రేమ‌లో ఉన్నార‌న్న వార్త‌లు మ‌రింత స్ట్రాంగ్ అయ్యాయి.

నిన్న వ‌రుణ్ త‌న పుట్టిన రోజు సంద‌ర్భంగా బెంగ‌ళూరు వెళ్ల‌డంతో లావ‌ణ్య కోస‌మే అన్న ప్ర‌చారం టాలీవుడ్‌లో ఎక్కువుగా జ‌రిగింది. అయితే ఈ వార్త‌ల‌పై లావ‌ణ్య స్పందించింది. తాను ప్ర‌స్తుతం డెహ్ర‌డూన్‌లో ఉన్నాన‌ని… తాను ఫ్యామిలీతో సంతోషంగా ఉన్నాన‌ని.. కొన్ని ఫొటోలు కూడా ఇన్‌స్టా గ్రామ్‌లో షేర్ చేసింది. లావ‌ణ్య ఇచ్చిన క్లారిటీతో వ‌రుణ్ లావ‌ణ్య‌కు ప్ర‌పోజ‌ల్ చేశాడ‌ని.. వీరికి త్వ‌ర‌లోనే పెళ్లి అంటూ వైర‌ల్ అయిన వార్త‌లు పుకార్లే అని తేలింది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news