Moviesపక్కలో పడుకుంటేనే బిగ్ బాస్ ఆఫర్..సంచలనంగా మారిన ఆడియో లీక్..?

పక్కలో పడుకుంటేనే బిగ్ బాస్ ఆఫర్..సంచలనంగా మారిన ఆడియో లీక్..?

బిగ్ బాస్ షో గురించి తెలియని వారంటూ ఉండరు. మొదట్లో చాలా మందికి ఈ షో పెద్దగా అర్ధంకాకపోయినా ..సీజన్స్ గడిచే కొద్ది నెమ్మదిగా అర్ధం చేసుకుంటూ వచ్చారు. అస్సలు ఈ బిగ్ బాస్ షో అనేది ఎలా స్టార్ట్ అయ్యిందో తెలుసా..?..నిజానికి ‘బిగ్ బ్రదర్’ అనే ఇంగ్లీష్ రియాలిటీ షో ఆధారంగా హిందీలో ‘బిగ్ బాస్’ ప్రారంభం అయింది. ఇక అక్కడి మంచి ఆదరణ లభించడంతో..ఆ తర్వాత దేశంలోని చాలా భాషల్లో ఇది మొదలైంది.

అన్నీ చోట్ల కూడా సక్సెస్ ఫుల్ గా రన్ అవుతుంది. ఇక అన్నింటికన్న ఈ షో తెలుగులో బాగా క్లిక్ అయ్యిందనే చెప్పాలి. సాదాసీదాగా మొదలైన ఈ షో ని తారక్ తనదైన స్టైల్లో హోస్టింగ్ చేస్తూ దుమ్ముదులిపేశాడు. ఇక అతి తక్కువ టైమ్‌లోనే ప్రేక్షకుల హృదయాలను దోచుకున్న ఈ షో ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా ఐదు సీజన్లను సక్సెస్‌ఫుల్‌గా పూర్తి చేసేసుకుంది.

ఇప్పుడు బిగ్ బాస్ ఓటీటీలో కూడా రాబోతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే దీనికి సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తి చేసిన టీం..కంటెస్టేంట్ల లిస్ట్ ను కూడా ఫైనల్ చేసుకుందట. అయితే ఈసారి 24*7 మనం బిగ్ బాస్ చూడవచ్చు. అయితే తాజాగా సోషల్ మీడియాలో ఓ వార్త హాట్ టాపిక్ గా మారింది. నిజానికి బిగ్ బాస్ షో మొదలైయ్యేముందు టీం కొందరిని సెలక్ట్ చేసుకుని..వాళ్ళకి ఫోన్లు చేసి అడుగుతారట. ఇక అవతలి కంటెస్టెంట్..నో చెప్పితే బలవంతం చేయరట..అదే కంటెస్టెంట్ యస్ చెప్పితే ..వాళ్ళను ఫస్ట్ డైరెక్ట్ గా కలిసి కొన్ని విషయాలు మాట్లాడి..ఆ తరువాత అగ్రిమెంట్ మీద సైన్ చేయించుకుంటారట.

అయితే, ఇక్కడ మరో సంచలన విషయం బయటపడ్డట్లు తెలుస్తుంది. బిగ్ బాస్ ఓటీటీకి ఆఫర్ అందుకున్న ఓ సోషల్ మీడియా స్టార్ బిగ్ బాస్ లోకి వెళ్ళేందుకు ఓకే చెప్పిందట. ఇక పారితోషకం గురించి మాట్లాడదాం రండి అని ఓ హోటల్ కు పిలిచి మాట్లాడుతూ..మీరు హౌస్ లోకి వెళ్ళాలి అంటే నాకు ఫేవర్ చేయాలి అంటూనే పక్కలో పడుకుంటే మీ పేరు ని ఫైనల్ చేస్తా అన్నాడట.

దీంతో బిత్తరపోయిన సదరు యూట్యూబర్..ఆఫర్ ని రిజెక్ట్ చేసి ఇంటికి వచ్చి బోరున ఏడ్చేసిందట. ఇక ఆమె ఈ విషయం వెంటనే కాల్ చేసి వాళ్ళ ఫ్రెండ్ కి చెప్పడంతో ఆ మ్యాటర్ కాస్తా లీక్ అయ్యి నెట్టింట పెద్ద దుమారమే రేపుతుంది. ఏది ఏమైనా ఈరోజుల్లో క్యాస్టింగ్ కౌచ్ పేరు ఎక్కువగా వినిపిస్తుంది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news