Moviesనిహారికకు భ‌ర్త పెట్టిన కండీష‌న్లు ఇవే...!

నిహారికకు భ‌ర్త పెట్టిన కండీష‌న్లు ఇవే…!

మెగా ఫ్యామిలీ డాట‌ర్‌, మెగా ప్రిన్స్ నిహారిక సినిమాల్లోకి వ‌చ్చి హీరోయిన్‌గా న‌టించ‌డ‌మే పెద్ద సంచ‌ల‌నం. ఇండ‌స్ట్రీలో పెద్ద ఫ్యామిలీ అయిన నిహారిక హీరోయిన్‌గా చేస్తుంద‌ని ఎవ్వ‌రూ ఊహించ‌లేదు. ఒక‌మ‌న‌సు సినిమాతో హీరోయిన్‌గా వ‌చ్చిన ఆమె తెలుగులో మూడు సినిమాల‌తో పాటు త‌మిళ్‌లో మ‌రో సినిమా చేశారు. ఆ త‌ర్వాత గుంటూరుకు చెందిన విశ్రాంత పోలీస్ అధికారి కుమారుడు జొన్న‌ల‌గ‌డ్డ చైత‌న్య‌ను ఆమె పెళ్లి చేసుకుని ప్ర‌స్తుతం ఫ్యామిలీ లైఫ్ ఎంజాయ్ చేస్తున్నారు.

నిహారిక – చైత‌న్య పెళ్లి రాజ‌స్థాన్‌లోని ఉద‌య్‌పూర్ ఫ్యాలెస్‌లో జ‌రిగింది. నిహారిక కేవ‌లం బుల్లితెర‌పై యాంక‌రింగ్‌తో మాత్ర‌మే కాదు.. త‌న అల్ల‌రి, చిలిపి చేష్ట‌ల‌తో ఎంతో అల‌రించేవారు. అయితే ఇప్పుడు నిహారిక నిర్మాత‌గాను స‌త్తా చాట‌నుంది. ఆమె నిర్మాణంలో కొన్ని వెబ్ సీరిస్‌లు ప్లాన్ చేస్తున్నారు. ఇందులో ఇండ‌స్ట్రీలో పేరున్న న‌టీ, న‌టులు న‌టిస్తున్నారు.

తాజాగా ఓ టీవీలో పాల్గొన్న నిహారిక కొన్ని ఆస‌క్తిక‌ర విష‌యాలు వెల్ల‌డించారు. పెళ్ల‌య్యాక ఎందుకు సినిమాల్లో న‌టించ‌డం లేద‌న్న ప్ర‌శ్న‌కు ఆమె ఆన్స‌ర్ ఇచ్చారు. త‌న భ‌ర్త చైత‌న్య‌కు తాను సినిమాల్లో న‌టించ‌డం ఇష్టం లేద‌ని.. అందుకే తాను సినిమాలు చేయ‌డం లేద‌ని చెప్పుకొచ్చింది. అయితే త‌న‌కు సినిమా, ఎంట‌ర్టైన్‌మెంట్ రంగం అంటే పిచ్చ ఇష్టం అని ఈ రంగంతో ఉన్న అనుబంధం మాత్రం తాను వ‌దులుకోన‌ని చెప్పింది.

ఇక త‌న పెద‌నాన్న మెగాస్టార్ చిరంజీవి న‌టించిన సినిమాల‌లో బావ‌గారు బాగున్నారా సినిమా అంటే త‌న‌కు ఎంతో ఇష్టం అని.. ఆ సినిమాను చాలాసార్లు చూశాన‌ని చెప్పిన నిహారిక‌, రుద్ర‌వీణ సినిమాతో పాటు బాబాయ్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ న‌టించిన గుడుంబా శంక‌ర్ సినిమా కూడా చాలాసార్లు చూశాన‌ని చెప్పింది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news