Newsఅఖండ ఫ‌స్ట్ బెనిఫిట్ షో ఆ థియేట‌ర్లోనే...!

అఖండ ఫ‌స్ట్ బెనిఫిట్ షో ఆ థియేట‌ర్లోనే…!

యువ‌ర‌త్న నంద‌మూరి బాల‌కృష్ణ న‌టిస్తోన్న అఖండ సినిమా ఇప్ప‌టికే షూటింగ్ పూర్తి చేసుకుంది. డిసెంబ‌ర్ 2న ఈ సినిమా ప్ర‌పంచ వ్యాప్తంగా భారీ ఎత్తున రిలీజ్ అవుతోంది. బాల‌య్య – బోయ‌పాటి కాంబినేష‌న్లో ఖ‌చ్చితంగా హ్యాట్రిక్ కొడుతుంద‌ని అంచ‌నాలు ఉన్న ఈ సినిమాలో ప్ర‌గ్య జైశ్వాల్ హీరోయిన్‌. బాల‌య్య సినిమా రిలీజ్ అవుతుంది అంటే రిలీజ్ ముందు రోజు అర్ధ‌రాత్రి నుంచే ప్రీమియ‌ర్ షోలు, థియేట‌ర్ల ముస్తాబుల‌తో ఎంత హంగామా ఉంటుందో ప్ర‌త్యేకంగా చెప్ప‌క్క‌ర్లేదు.

అయితే ఈ సారి ఆ హంగామా ఉండేలా క‌న‌ప‌డ‌డం లేదు. రెండు తెలుగు రాష్ట్రాల ప్ర‌భుత్వాలు ఇండ‌స్ట్రీకి వ‌రుస పెట్టి షాకులు ఇస్తున్నాయి.. కొంత‌కాలంగా బెనిఫిట్ షోల‌కు ప‌ర్మిష‌న్లు ఇవ్వ‌డం లేదు. గ‌తంలో తెలుగుదేశం, కాంగ్రెస్ ప్ర‌భుత్వాలు ఉన్న‌ప్పుడు హైద‌రాబాద్‌లో అర్ధ‌రాత్రి నుంచే బెనిఫిట్ షోల‌తో నానా హంగామా న‌డిచేది. అయితే కేసీఆర్ సీఎం అయ్యాక శాంతి భ‌ద్ర‌త‌ల నేప‌థ్యంలో ఈ అర్ధ‌రాత్రి షోలు ఎత్తేశారు.

ఇక ఇప్పుడు ఏపీలోనూ రోజుకు కేవ‌లం నాలుగు ఆట‌లు మాత్ర‌మే ఉంటాయ‌ని నిన్న‌నే ప్ర‌భుత్వం అధికారికంగా చెప్పేసింది. ఇక టిక్కెట్ల రేట్లు పెంచుకుని అమ్ముకోవ‌డం కూడా లేదు. ఇక అఖండ సినిమా విష‌యానికి వ‌స్తే ఈ సినిమాకు ముందుగా హైద‌రాబాద్‌లో బెనిఫిట్ షోలు ప‌డ‌నున్నాయి. కూక‌ట్‌ప‌ల్లిలోని భ్ర‌మ‌రాంబ‌, మ‌ల్లిఖార్జున థియేట‌ర్లో డిసెంబ‌ర్ 2వ తేదీ ఉద‌యం 5-6 గంట‌ల మ‌ధ్య‌లో ఈ షోలు ప‌డ‌నున్నాయ‌ని తెలుస్తోంది.

అయితే మ‌రో ప్లాన్ కూడా చేస్తున్నారు. రిలీజ్‌కు ముందు రోజు ఇక్క‌డ సెకండ్ షో నుంచే అఖండ షోలు వేయించాల‌ని కూడా ప్లాన్ చేస్తున్నారు. గ‌తంలో బాహుబ‌లి 2కు కూడా ముందు రోజు సెకండ్ షో నుంచే షోలు వేశారు. ఇప్పుడు కూడా ముందు రోజు నుంచే అఖండ జాత‌ర ప్రారంభించాల‌ని చూస్తున్నారు. ఏదేమైనా అఖండ ఫ‌స్ట్ షో ఏపీ కంటే తెలంగాణ‌లోనే ముందు ప‌డ‌నున్నాయి.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news