Moviesవిడాకులు ఇచ్చినా కూడా స‌మంత మ‌రీ క‌క్ష కట్టేసిందా...!

విడాకులు ఇచ్చినా కూడా స‌మంత మ‌రీ క‌క్ష కట్టేసిందా…!

టాలీవుడ్ టాప్ హీరోయిన్ సమంత – అక్కినేని నాగ చైతన్య ఎవ్వ‌రూ ఊహించ‌ని విధంగా విడాకులు తీసుకున్నారు. విడాకుల త‌ర్వాత ఎవ‌రి దారిది వారిదే అయ్యింది. ఎవ‌రి సినిమాల్లో వారు బిజీ అయిపోయారు. వీరు విడాకులు తీసుకోవ‌డం ఇప్ప‌ట‌కీ చాలా మందికి న‌చ్చ‌డం లేదు. వారి అభిమానులు జీర్ణించుకోలేక పోతున్నారు. విడాకుల త‌ర్వాత స‌మంత సోష‌ల్ మీడియాలో ర‌క‌ర‌కాల అర్థాలు వ‌చ్చేలా పోస్టులు పెడుతూ వ‌స్తోంది. చైతు మాత్రం ఒక‌టీ అరా పోస్టులు మిన‌హా ఎప్ప‌టిలాగానే సోష‌ల్ మీడియాకు దూరంగా ఉంటూ వ‌స్తున్నాడు.

నిన్న చైతు పుట్టిన రోజు సంద‌ర్భంగా చాలా మంది సెల‌బ్రిటీలు, ఇండ‌స్ట్రీ వాళ్లు చైతుకు బ‌ర్త్ డే విష‌స్ చెప్పారు. అయితే స‌మంత మాత్రం చైతుకు ఎలాంటి విషెస్ చెప్ప‌లేదు. అక్క‌డ వ‌ర‌కు బాగానే ఉంది. అయితే నిన్న స‌మంత చేసిన ప‌నికి నెటిజ‌న్ల‌కు కూడా చాలా చిర్రెత్తుకొచ్చేలా ఉంది. స‌మంత త‌న పెంపుడు కుక్క హాష్‌కు బ‌ర్త్ డే విషెస్ చెప్పడంతో పాటు దాంతో త‌న‌కు ఉన్న అనుబంధం షేర్ చేసుకుంది.

పెంపుడు కుక్క‌తో ఉన్న అనుబంధం గుర్తు చేసుకుంటూ ఇన్‌స్టా గ్రామ్‌లో కొన్ని ఫొటోలు కూడా షేర్ చేసింది. పెంపుడు కుక్క‌తో అంత ప్రాధాన్య‌త ఇచ్చి… తాను ఎంతో ప్రేమించి నాలుగేళ్లు కాపురం చేసిన చైతును మాత్రం ఏ మాత్రం గుర్తుంచు కోక‌పోవ‌డంలో ఆంత‌ర్యం ఏంట‌ని ప‌లువురు ప్ర‌శ్నిస్తున్నారు. ఏదేమైనా సామ్ , చైతు విష‌యంలో బాగా క‌క్ష క‌ట్టిన‌ట్టుగా చేస్తోంద‌ని కొంద‌రు నెటిజ‌న్లు కామెంట్లు పెడుతున్నారు.

స‌రే విడిపోయి ఎవ‌రి దారులు వారు చూసుకున్నా.. ఓ బెస్ట్ ఫ్రెండ్‌గా, తాను ఎంతో ప్రేమించిన వ్య‌క్తిగా, మాజీ భ‌ర్త‌గా విషెస్ చెప్పి ఉంటే సామ్ గౌర‌వం మ‌రింత ఇనుమ‌డిపంజేసిన‌ట్లు అయ్యేద‌ని అంటున్నారు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news