Moviesఅలాంటి హీరోయిన్స్ కి దిమ్మ తిరిగే కౌంటర్ ఇచ్చిన రాధికా ఆప్టే..!!

అలాంటి హీరోయిన్స్ కి దిమ్మ తిరిగే కౌంటర్ ఇచ్చిన రాధికా ఆప్టే..!!

కుండ బద్దలు కొట్టినట్లు మాట్లాడే వారిలో ముందు వరుసలో ఉంటారు నది రాధికా ఆప్టే. ఇక ఆమె నటన గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. క్యారెక్టర్‌ డిమాండ్‌ చేస్తే ఏం చేయడానికైనా వెనకాడరు. విభిన్న పాత్రలు సెలక్ట్‌ చేసుకుంటూ.. తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు రాదిక ఆప్టే.

రాధికా ఆప్టే… తెలుగు వారికి బాలకృష్ణ సరసన నటించిన ముంబై బ్యూటీగా మాత్రమే తెలుసు. వర్మ ‘రక్తచరిత్ర’లోనూ ఆమె మంచి మార్కులు కొట్టేసింది. కానీ, హిందీ ఆడియన్స్‌కి ఆమె సూపర్బ్ యాక్టర్. రాధికా ఏ సినిమాలో ఉన్నా, వెబ్ సిరీస్‌లో కనిపించినా పర్ఫామెన్స్‌తో అదరగొట్టేస్తుంది. నటనకి అవకాశం లేకుంటే ఆమె దాదాపుగా ప్రాజెక్ట్ సైన్ చేయనే చేయదు.

సినిమాల కంటే కూడా ఎక్కువగా ఎదో ఒక వివాదంలో చిక్కుకుంటుంది. రాధికా ఆప్టే సోషల్ మీడియాలో చాలా యాక్టీవ్ గా ఉంటుంది. సౌత్ ఇండస్ట్రీ అంటే చిరాకు అని చెప్పిన ఈ భామ.. బాలీవుడ్‌లో మాత్రం దూసుపోతుంది. హాట్ ఫోటోషూట్‌లు చేసుకుంటూ కాలం గడిపేస్తుంది. అయితే తాజాగా ఆమె మరోసారి మీడియాలో హాట్ టాపిక్ గా నిలిచింది.

ఈ మధ్య కాలంలో సోష‌ల్ మీడియాలో నో ఫిల్ట‌ర్ లుక్ ట్రెండ్ గా మారింది. మేక‌ప్ వేయ‌కుండా.. టెక్నాల‌జీ ద్వారా మెరుగులు దిద్ద‌కుండా తాము ఒరిజిన‌ల్‌గా ఎలా ఉన్నామో అలాగే ఫొటోలు దిగి సోష‌ల్ మీడియాలో పోస్ట్ చేయ‌డం హీరోయిన్ల‌కు ఫ్యాష‌న్‌గా మారిందీ మ‌ధ్య‌.ఐతే ఇదేమీ పెద్ద గొప్పేమీ కాదంటోంది రాధికా ఆప్టే. హీరోయిన్ల‌లో చాలామంది స‌ర్జ‌రీల ద్వారా త‌మ అందాల‌కు మెరుగులు దిద్దుకుంటూ ఉంటారని.. ఈ నో ఫిల్ట‌ర్ ఫొటోలు పెట్ట‌డం ద్వారా ముందు ఆ స‌ర్జ‌రీలు ఆపాల‌ని కౌంట‌ర్లు వేసింది రాధికా.

 

 

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news