Moviesచిరంజీవి చెల్లెలు ఇప్పుడు ఏం చేస్తుందో ?  తెలుసా...!

చిరంజీవి చెల్లెలు ఇప్పుడు ఏం చేస్తుందో ?  తెలుసా…!

మెగాస్టార్ చిరంజీవి చెల్లెలు ఇప్పుడు ఏం చేయ‌డం ఏంటి ?  అని ఆలోచ‌న‌ల్లోకి వెళ్లారా ?  చిరంజీవికి స్వ‌యానా ఇద్ద‌రు తోబుట్టువులు ఉన్నారు. వీరిలో ఒక‌రు సాయిధ‌ర‌మ్ తేజ్ త‌ల్లి. అయితే ఇప్పుడు చెప్పుకునే చెల్లి చిరు తోబుట్టువు కాదు.. ఓ బంప‌ర్ హిట్ సినిమాలో చిరుకు చెల్లిగా న‌టించిన న‌టి గురించి. చిరు హీరోగా ముత్యాల సుబ్బ‌య్య ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కిన సినిమా హిట్ల‌ర్‌. రంభ హీరోయిన్‌గా వ‌చ్చిన ఈ సినిమా అప్ప‌ట్లో బంప‌ర్ హిట్ అయ్యింది.

 

 

ఈ సినిమాలో చిరుకు ఐదుగురు చెల్లెల్లు ఉన్నారు. ఈ కాన్సెఫ్ట్ అప్ప‌ట్లో ప్రేక్ష‌కుల‌ను ఎంత‌గానో ఆక‌ట్టుకుంది. అటు ఐదుగురు చెల్లెల్ల అన్న‌గా చిరు సెంటిమెంట్‌, ఇటు రంభ‌తో ప్రేమాయ‌ణం, పాట‌లు, ఫ్యామిలీ స్టోరీ అన్ని క‌లిసి హిట్ల‌ర్‌ను సూప‌ర్ హిట్ చేశాయి. ఈ సినిమాలో చిరుకు ఒక చెల్లిగా మీనాకుమారి న‌టించారు. ఆమో స్వ‌త‌హాగా తెలుగు అమ్మాయే అయినా తెలుగులో కంటే త‌మిళ్‌, మ‌ళ‌యాళంలో ఎక్కువ సినిమాలు చేసింది.

 

ఆమె హీరోయిన్ అవ్వాల‌ని ఇండ‌స్ట్రీకి వ‌చ్చినా క్యారెక్ట‌ర్ ఆర్టిస్టుగా సెటిల్ అయ్యింది. విక్ట‌రీ వెంకటేష్ జ‌యం మ‌న‌దేరా సినిమాలో కూడా న‌టించింది. ఆ త‌ర్వాత ఆమె త‌మిళం, మ‌ళ‌యాళం సినిమాల్లో ఎక్కువుగా న‌టించింది. తెలుగు బుల్లితెర‌పై ప్రసార‌మైన సూప‌ర్ డూప‌ర్ సీరియల్స్ అంత‌రంగాలు, అనురాగాలు సీరియ‌ల్స్‌తో ఆమె ఇక్క‌డ ఎంతో మంది అభిమానుల‌ను సొంతం చేసుకుంది.

 

ఇప్పుడు కూడా మీనాకుమారి త‌మిళ్‌, మ‌ళ‌యాళంలో ఎన్నో సూప‌ర్ డూప‌ర్ హిట్ సీరియ‌ల్స్‌లో న‌టిస్తోంది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news