Moviesశ్రావ‌ణి - దేవ‌రాజ్ ప్రేమ‌లో ఊహించ‌ని ట్విస్ట్‌

శ్రావ‌ణి – దేవ‌రాజ్ ప్రేమ‌లో ఊహించ‌ని ట్విస్ట్‌

ప్ర‌ముఖ సినీనటి శ్రావ‌ణి ఆత్మ‌హ‌త్య త‌ర్వాత ఈ కేసులో రోజు కొత్త విష‌యం బ‌యట‌కు వ‌స్తోంది. ఇక శ్రావ‌ణికి దేవ‌రాజ్ గ‌తేడాది ఆగ‌స్టు 8నే టిక్ టాక్ ద్వారా ప‌రిచ‌యం అయ్యాడ‌ట‌. ఓ సీరియ‌ల్లో న‌టిచేందుకు అడిష‌న్స్ కోసం దేవ‌రాజ్ గ‌త న‌వంబ‌ర్‌లో హైద‌రాబాద్ వ‌చ్చి శ్రావ‌ణి ఇంట్లోనే 9 రోజుల పాటు ఉన్నాడు. ఈ 9 రోజుల్లోనే వారి మ‌ధ్య సాన్నిహిత్యం ఏర్ప‌డింది. ఆ టైంలోనే శ్రావ‌ణి ఫోన్లో వివ‌రాలు చూసిన దేవ‌రాజ్ ఆమెకు సాయికృష్ణ‌తో పాటు అశోక్‌రెడ్డితో సంబంధం ఉంద‌ని గుర్తించాడు.

 

దీంతో శ్రావ‌ణిని ప‌క్క‌న పెట్టిన దేవ‌రాజ్ తన స్వస్థలానికి వెళ్లిపోయాడు. అయితే సీరియ‌ల్స్‌లో న‌టించేందుకు అవ‌కాశం రావ‌డంతో అత‌డు ఈ సారి హైద‌రాబాద్ వ‌చ్చి కుటుంబంతో స‌హా సీతాఫల్‌మండి ప్రాంతంలో ఉంటున్నాడు. ఈ యేడాది ఫిబ్ర‌వ‌రి 22న శ్రావ‌ణి ఇంట్లో ఓ నటుడి బ‌ర్త్ డే వేడుక జ‌రిగింది. ఈ వేడుక‌కు శ్రావ‌ణి దేవ‌రాజ్‌ను కూడా ఆహ్వానించింది. ఆ వేడుక‌లోనే ఆమె అంద‌రిముందు ‘ఐ లవ్‌ దేవరాజ్‌రెడ్డి’అంటూ ప్రకటించింది.

 

అయితే దేవ‌రాజ్‌కు అప్ప‌టికే ఆమెకు అశోక్‌రెడ్డి, సాయితో ఉన్న సంబంధాలు ఉన్నాయ‌ని గ్ర‌హించిన దేవ‌రాజ్ నీపై అంత ఆస‌క్తి లేద‌ని చెప్పేశాడు. దేవరాజ్‌కు సర్దిచెప్పడానికి శ్రావణి ప్రయత్నించినా.. అతడు తిరస్కరించాడు. ఆ త‌ర్వాత శ్రావ‌ణి దేవరాజ్ త‌న‌ను వేధిస్తున్నాడ‌ని ఎస్సార్ న‌గ‌ర్ స్టేష‌న్లో కేసు కూడా పెట్టింది. చివ‌ర‌కు ఆమె ముగ్గురి వేధింపుల కార‌ణంగా చ‌నిపోతున్నానంటూ దేవ‌రాజ్‌కు ఫోన్ చేసి ఆత్మ‌హ‌త్య చేసుకుంది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news