Moviesబిగ్‌బాస్ సూర్య‌కిర‌ణ్‌కు నాగార్జున‌కు ఉన్న లింక్‌ తెలుసా..!

బిగ్‌బాస్ సూర్య‌కిర‌ణ్‌కు నాగార్జున‌కు ఉన్న లింక్‌ తెలుసా..!

బిగ్‌బాస్ 4లోకి  కంటెస్టెంట్‌గా ఎంట్రీ ఇచ్చిన టాలీవుడ్ డైరెక్ట‌ర్ సూర్య‌కిర‌ణ్ అనూహ్యంగా తొలి వారంలోనే అంద‌రి అంచ‌నాలు త‌ల్ల‌కిందులు చేస్తూ ఎలిమినేట్ అయ్యాడు. సినిమా డైరెక్ట‌ర్ కావడంతో పాటు స్ట్రాంగ్ కంటెస్టెంట్‌గా హౌస్‌లోకి వెళ్లిన సూర్య కిర‌ణ్ కాస్త అతి చేయ‌డంతో పాటు అంతా త‌న‌కే తెలుసు అన్న ధీమాతో ఉండ‌డంతో పాటు ప్ర‌తి ఒక్క‌రిని డామినేట్ చేసేందుకు ప్ర‌య‌త్నించ‌డం చాలా మందికి న‌చ్చ‌లేదు. అందుకే ఫ‌స్ట్ వీకెండ్‌లో అంద‌రికంటే త‌క్కువ ఓటింగ్‌తో హౌస్ నుంచి ఎలిమినేట్ అయ్యాడు.

 

సూర్య‌కిర‌ణ్‌కు షో హోస్ట్ చేస్తోన్న నాగార్జున‌కు ఓ లింక్ ఉంది. నాగార్జునే సూర్య కిర‌ణ్‌కు మంచి లైఫ్ ఇచ్చాడు. నాగార్జున నిర్మాత‌గా త‌న మేన‌ళ్లుడు సుమంత్ హీరోగా స‌త్యం సినిమా వ‌చ్చింది. ఆ సినిమా అప్ప‌ట్లో సూప‌ర్ హిట్ అయ్యింది. జెనీలియా హీరోయిన్‌. సుమంత్‌కు స‌త్యం మంచి బ్రేక్ ఇచ్చినా దానిని నిల‌బెట్టుకోలేక హీరోగా నిల‌దొక్కుకోలేదు. ఇక నాగార్జునే ఈ సినిమాను నిర్మించాడు.

 

ముందుగా నాగార్జున‌కు క‌థ చెప్ప‌గా నాగ్ మెచ్చుకుని తానే స్వ‌యంగా ఈ సినిమాను నిర్మించాడు. ఇక సూర్య కిర‌ణ్‌, హీరోయిన్ క‌ళ్యాణి పెళ్లి చేసుకున్నారు. త‌ర్వాత వీరి మ‌ధ్య మ‌న‌స్ప‌ర్థ‌లు రావ‌డంతో విడిపోయారు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news