Moviesప్ర‌భాస్ ఆస్తుల లెక్క చూస్తే క‌ళ్లు జిగేల్ మనాల్సిందే..!

ప్ర‌భాస్ ఆస్తుల లెక్క చూస్తే క‌ళ్లు జిగేల్ మనాల్సిందే..!

యంగ్ రెబ‌ల్ స్టార్ ప్ర‌భాస్ ఈశ్వ‌ర్ సినిమాతో తెలుగులో హీరో అయినా ఇప్పుడు నేష‌న‌ల్ స్టార్ అయిపోయాడు. బాహుబ‌లి సినిమా త‌ర్వాత ప్ర‌భాస్ వ‌రుస‌పెట్టి పాన్ ఇండియా సినిమాలే చేసుకుంటూ వ‌స్తున్నాడు. బాహుబ‌లి 1,2 త‌ర్వాత సాహో సినిమాలు జాతీయ స్థాయిలో ప్ర‌భాస్‌కు మంచి పేరు తెచ్చిపెట్టాయి. ఇప్పుడు ప్ర‌భాస్ చేస్తోన్న రాధే శ్యామ్‌, ఆ త‌ర్వాత నాగ్ అశ్విన్ సైన్స్‌ఫిక్ష‌న్ సినిమా, ఆదిపురుష్ కూడా పాన్ ఇండియా సినిమాలే.

News18 Telugu - ప్రభాస్ ఎక్కడున్నాడు.. రెబల్ స్టార్ కోసం ఫ్యాన్స్  ఎదురుచూపులు.. | Prabhas fans eagerly waiting to know about their favorite  star movie updates and asking in twitter pk- Telugu News ...

ఓం రౌత్ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతోన్న ఆదిపురుష్ సినిమాలో అయితే ప్ర‌భాస్ శ్రీరాముడి పాత్ర‌లో నటిస్తున్నాడు. ఈ సినిమా బ‌డ్జెట్టే ఏకంగా రు. 100 కోట్లు కాగా, బాలీవుడ్ హీరో సైఫ్ ఆలీఖాన్ విల‌న్ లంకేశ్ రోల్లో న‌టిస్తున్నాడు. ఇక ప్ర‌భాస్ ఇప్ప‌టి వ‌ర‌కు అటు సినిమాల‌తో పాటు ఇటు రియ‌ల్ ఎస్టేట్‌, ఇత‌ర వ్యాపారాల ద్వారా 13 మిలియ‌న్ డాల‌ర్లు సంపాదించాడ‌ట‌.

Prabhas: ప్రభాస్ కొత్త సినిమా టైటిల్ రాధే శ్యామ్ - prabhas new movie title  name radheshyam goes viral | Samayam Telugu

వాస్త‌వానికి యూవీ క్రియేష‌న్స్ ప్ర‌భాస్ స‌న్నిహితుల‌ది అని చెపుతున్నా దీనిలో ఎక్కువ పెట్టుబ‌డులు ప్ర‌భాస్‌వే అన్న టాక్ ఉంది. ఇక యూవీ క్రియేష‌న్స్ రెండు తెలుగు రాష్ట్రాల్లో చాలా థియేట‌ర్ల‌ను కూడా ర‌న్ చేస్తూ ఈ వ్యాపారంలోకి ఎంట్రీ ఇచ్చింది. సూళ్లూరుపేట లాంటి చోట్ల భారీ స్థాయిలో స్క్రీన్ల‌ను కూడా సాహోతో ఓపెన్ చేసింది. ప్ర‌భాస్ త‌క్కువ టైంలోనే బిజినెస్ ప‌రంగా ప‌క్కాగా ఫిక‌ప్ అయ్యాడ‌నే చెప్పాలి.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news