Moviesనాగార్జున‌ను బిట్టూ అంటూ ఆట‌ప‌ట్టించిన లేడీ కంటెస్టెంట్‌

నాగార్జున‌ను బిట్టూ అంటూ ఆట‌ప‌ట్టించిన లేడీ కంటెస్టెంట్‌

బిగ్‌బాస్ హౌస్‌లోకి ఐదో కంటెస్టెంట్‌గా జోర్‌దార్ సుజాత ఎంట్రీ ఇచ్చారు. ఆమె తెలంగాణ‌లోని వ‌రంగ‌ల్ జిల్లాకు చెందిన వారు. ఆమెను చూసిన నాగ్ అచ్చ‌తెలుగు తెలంగాణ ఆడ‌పిల్ల‌లా ఉన్నావ‌ని ప్ర‌శంసించాడు. ఆమె ఆమె నాగార్జున‌ను బిట్టు బిట్టు అంటూ స‌ర‌దాగా ఆట‌ప‌ట్టించింది. ఆమె త‌న తెలంగాణ యాసలో ప‌టా ఫ‌ట్ ధ‌నాధ‌న్ డైలాగులు చెప్పి అల‌రించింది.

ఇక ఆమె హౌస్‌లోకి ఎంట్రీ ఇస్తూ శుభ‌కార్యానికి రైట్ లెగ్ శుభం అంటూ ఛ‌లో రైట్ లెగ్ అని కుడి కాలు లోప‌ల‌కు పెట్టి ఎంట్రీ ఇచ్చింది. ఇక తెలంగాణ భాష‌లో త‌న‌కు న‌చ్చ‌ని వాళ్ల‌ను ఎలా తిడ‌తానో కూడా ఆమె చెప్పింది. ఏం క‌థ‌లు ప‌డుతున్నావా ? ఎట్ల మాట్ల‌డుతున్నావ్ ?  మ‌ర్యాద‌గా మాట్లాడు ? అంటూ త‌న జోర్‌దార్ డైలాగులు వేసింది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news