Moviesబిగ్‌బాస్ 4: స్టార్ మా లోగో చేంజ్‌‌

బిగ్‌బాస్ 4: స్టార్ మా లోగో చేంజ్‌‌

మా టీవీ తెలుగు ప్రేక్ష‌కుల‌కు సుప‌రిచితం అయిపోవ‌డంతో పాటు ఇంట్లోనే బుల్లి థియేట‌ర్ అయిపోయింది. ఇక బుల్లితెర రంగంలో ఎన్నో సంచ‌ల‌న విష‌యాల‌తో ప్రేక్ష‌కుల మ‌న‌స్సుల‌ను చూర‌గొన్న మా టీవీ స్టార్ మాగా అవ‌త‌రించింది. ఇక బుల్లితెర రియాల్టీ పాపుల‌ర్ షో బిగ్‌బాస్‌ను సైతం వెండితెర‌కు ప‌రిచ‌యం చేసింది స్టార్ మానే. ఇప్ప‌టికే విజ‌య‌వంతంగా మూడ సీజ‌న్లు కంప్లీట్ చేసుక‌న్న బిగ్‌బాస్ ఇక ఆదివారం నుంచి నాలుగో సీజ‌న్లోకి ఎంట్రీ ఇచ్చింది.

 

ఆదివారం నుంచి నాలుగో సీజ‌న్ బిగ్‌బాస్ ప్రారంభ‌మైంది. అయితే ఈ సీజ‌న్ ప్రారంభ‌మైన వెంట‌నే స్టార్ మా లోగోను యాజ‌మాన్యం మార్చేసింది. స్టార్ మా లోగోలో ఇప్పుడు తెలుగు పదం కూడా యాడ్ చేశారు. స్టార్ అనే పధం ఇంగ్లీష్ లో ఉండగా మా అనే పదం తెలుగులో ఉంది. ఇక స్టార్ లోగోలో పసుపు కుంకుమ రంగులు ఉన్నాయి. ఈ లోగోను నాగార్జున లాంచ్ చేశారు. ఏదేమైనా స్టార్ మా లోగోలో తెలుగు సంస్కృతి ఉట్టిప‌డుతోంది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news