Moviesనానీకి ఐల‌వ్ యూ చెప్పిన హీరోయిన్ ఎవ‌రో తెలుసా..!

నానీకి ఐల‌వ్ యూ చెప్పిన హీరోయిన్ ఎవ‌రో తెలుసా..!

నేచుర‌ల్ స్టార్ నాని వైవిధ్య‌మైన క‌థ‌లు ఎంచుకుంటూ దూసుకు పోతున్నాడు. తాజాగా నాని వీ సినిమాతో ఓటీటీ ద్వారా ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చాడు. ఈ సినిమా ప్ర‌మోష‌న్ల‌లో నాని మాట్లాడుతూ ఆస‌క్తిక‌ర విష‌యాలు వెల్ల‌డించాడు. తాను ఎంతోమంది అంద‌మైన అమ్మాయిల‌తో క‌లిసి న‌టించాన‌ని.. వారితో త‌న‌కు ఉన్న సంబంధం కేవ‌లం సినిమాల వ‌ర‌కు మాత్ర‌మే అని చెప్పిన నాని.. త‌నకు డైరెక్ష‌న్ అంటేనే ఇష్ట‌మ‌ని.. అయితే త‌న‌లో అంత‌కు మించిన నటుడు ఉండ‌డంతో తాను న‌టుడికే ఓటు వేశాన‌ని చెప్పాడు.

ఇక ఓ హీరోయిన్ మాత్రం త‌న‌కు ఇన్ డైరెక్టుగా ప్ర‌పోజ్ చేసింద‌ని.. దానిని తాను లైట్ తీస్కొన్నాన‌ని నాని చెప్పాడు. ఏదేమైనా నాని సినిమా రంగానికి సంబంధం లేని అమ్మాయి సంజ‌న‌ను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. నాని త‌న‌కు హీరోయిన్ ఇన్‌డైరెక్టుగా ప్ర‌పోజ్ చేసింద‌ని చెప్పినా ఆ హీరోయిన్ ఎవ‌రు ? అన్న‌ది మాత్రం చెప్ప‌లేదు. ఏదేమైనా నాని కూడా హీరోయిన్ల‌తో ప్ర‌పోజ్ చేసుకున్నాడంటే మ‌నోడు తెర‌వెన‌క కూడా చాలా మంది అమ్మాయిల మ‌న‌సు దోచే రొమాంటిక్ హీరోనే అనుకోవాలి.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news