Gossipsత‌న ల‌క్కీ హీరోయిన్‌తో విజ‌య్ ర‌చ్చ మ‌ళ్లీ మొద‌లెట్టేశాడా...!

త‌న ల‌క్కీ హీరోయిన్‌తో విజ‌య్ ర‌చ్చ మ‌ళ్లీ మొద‌లెట్టేశాడా…!

విజ‌య్ దేవ‌ర‌కొండ – ర‌ష్మిక మంద‌న్న ఎంత క్రేజీ పెయిరో తెలిసిందే. వీరిద్ద‌రు ఇప్ప‌టికే గీతా గోవిందం, డియ‌ర్ కామ్రేడ్ సినిమాల్లో క‌లిసి న‌టించారు. ఈ రెండు సినిమాల్లో ఈ జంట‌ను వెండితెర‌పై చూసిన తెలుగు ప్రేక్ష‌కులు ఈ జంట పెయిర్‌కు పిచ్చ పిచ్చ‌గా ఫిదా అయిపోయారు. ఈ జంట తెర‌మీద క‌నిపిస్తే చాలు సినిమా రిజ‌ల్ట్‌తో సంబంధం లేకుండా వ‌సూళ్లు దుమ్ము రేపుతున్నాయి. అంత క్రేజి పెయిర్ అయిపోయారు విజ‌య్‌, ర‌ష్మిక‌. ఇక స్టార్ హీరోల‌తో వ‌రుస‌గా ఛాన్సుల మీద ఛాన్సులు ద‌క్కించుకుంటోన్న ర‌ష్మిక‌, ఇటు విజ‌య్ వీరిద్ద‌రు ఇప్పుడు ఫుల్ ఫాంలో ఉన్నారు. వీరిద్ద‌రి కెమిస్ట్రీ సూప‌ర్బ్‌గా వ‌ర్క‌వుట్ అయ్యింది.

News18 Telugu - బంపర్ ఆఫర్‌ను‌ మిస్ చేసుకున్న రష్మిక మందన.. బాధలో  ఫ్యాన్స్.., Rashmika mandanna fans feeling bad for rejecting jersey hindi  remake offer- Telugu News, Today's Latest News in Telugu

ఈ క్ర‌మంలోనే విజ‌య్‌కు ర‌ష్మిక ల‌క్కీ హీరోయిన్ అన్న ముద్ర ప‌డిపోయింది. త‌న ల‌క్కీ హీరోయిన్‌తో విజ‌య్ మ‌రోసారి జోడీ క‌డుతున్నాడు. అయితే వీరిద్ద‌రు మ‌ళ్లీ జోడీ క‌ట్టేది సినిమా కోసం కాదు సుమా… ఓ బ్రాండ్ కోసం. ఓ షాపింగ్ మాల్ యాడ్ లో విజయ్ – రష్మిక కలిసి నటించబోతున్నారట. వీరు క‌లిసి చేసేది సినిమా అయినా.. యాడ్ అయినా అది సూప‌ర్ హిట్టే అన‌డంలో ఎలాంటి డౌట్ లేదు. వ‌చ్చే వార‌మే ఈ యాడ్ షూటింగ్ ఉంటుంద‌ట‌.

Kannada actress Rashmika Mandanna's residence in Virajpet raided by Income  Tax dept

ఇక విజ‌య్ ప్ర‌స్తుతం పూరి జ‌గ‌న్నాథ్ ద‌ర్శ‌క‌త్వంలో ఫైట‌ర్ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాలో అన‌న్య పాండే హీరోయిన్‌గా చేస్తోంది. ఈ సినిమా త‌ర్వాత విజ‌య్ మ‌రోసారి ర‌ష్మిక‌తో జోడీ క‌ట్టే ఛాన్సులు ఉన్నాయి. ఇక ర‌ష్మిక బ‌న్నీ పుష్ప‌తో పాటు నాని శ్యామ్ సింగ రాయ చేస్తోంది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news