Gossipsజ‌బ‌ర్ద‌స్త్‌కు సుడిగాలి సుధీర్ గుడ్ బై... ఆ ఛాన్స్ కోస‌మేనా..!

జ‌బ‌ర్ద‌స్త్‌కు సుడిగాలి సుధీర్ గుడ్ బై… ఆ ఛాన్స్ కోస‌మేనా..!

సుడిగాలి సుధీర్ ఈ పేరు రెండు తెలుగు రాష్ట్రాల ప్ర‌జ‌ల మ‌న‌సుల్లోకి ఎంతగా చొచ్చుకుపోయిందో ప్ర‌త్యేకంగా చెప్ప‌క్క‌ర్లేదు. ఏపీలో ఓ మ‌ధ్య‌త‌ర‌గ‌తి కుటుంబం నుంచి వ‌చ్చిన సుధీర్ ఈ రోజు బుల్లితెర‌పై త‌న‌దైన కామెడీతో కోట్లాది మంది ప్ర‌జ‌ల అభిమానం సొంతం చేసుకున్నాడు. ఇక జ‌బ‌ర్ద‌స్త్ షోతో సుధీర్‌కు మంచి గుర్తింపు వ‌చ్చింది. సుధీర్ – ర‌ష్మి జోడీని తెర‌మీద చూసేందుకు రెండు తెలుగు రాష్ట్రాల ప్ర‌జ‌లు ఎంత వేలం వెర్రితో ఉంటారో తెలిసిందే. ఇక 2013లో ప్రారంభ‌మైన ఈ జ‌బ‌ర్ద‌స్త్ షో ఏడు సంవ‌త్స‌రాలుగా విజ‌య‌వంతంగా కొన‌సాగుతోంది.

అసలు సమస్య అదే... సుడిగాలి సుధీర్, రష్మితో బిగ్ బాస్ నిర్వాహకుల చర్చలు? | Sudigali  Sudheer-Rashmi in Bigg Boss Telugu 3? - Telugu Filmibeat

ఇక జ‌బ‌ర్ద‌స్త్ షో ప్రారంభంలో వేణు టీంలో ఒక మెంబ‌ర్‌గా ఉండి ఈ రోజు టీం లీడ‌ర్ స్థాయికి ఎదిగారు. సుధీర్ టీం స్కిట్ స్టార్ట్ అయ్యింది అంటే ర‌చ్చ షురూయే. ఇక ర‌ష్మితో ఉన్న క్లోజ్‌నెస్ వ‌ల్ల వీరిద్ద‌రి మ‌ధ్య ప్రేమాయ‌ణం ఉంద‌న్న పుకార్లు వ‌చ్చినా అవేవి నిజం కాలేదు. ఇక ఇప్పుడు వెండితెర‌పై సైతం సుధీర్ త‌న టాలెంట్ ఫ్రూవ్ చేసుకునే ప‌నిలో ఉన్నాడు. ఇంత క్రేజ్ ఉన్న సుధీర్ ఇప్పుడు జ‌బ‌ర్ద‌స్త్‌కు గుడ్ బై చెప్పేస్తున్నాడ‌న్న ప్ర‌చారం అయితే జోరుగా సాగుతోంది.

 

అయితే అది పూర్తిగా కాదు… ఇప్ప‌టికే సాఫ్ట్‌వేర్ సుధీర్ లాంటి సినిమాల్లో హీరోగా చేసిన సుధీర్ ఇప్పుడు మ‌రో సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాలో న‌టించాలంటే కొద్ది రోజుల పాటు జ‌బ‌ర్ద‌స్త్‌కు గుడ్ బై చెప్ప‌క త‌ప్ప‌ని ప‌రిస్థితి. ఇక సినిమా షూటింగ్‌తో పాటు ఆ త‌ర్వాత 15 రోజులు గ్యాప్ తీసుకుని మ‌ళ్లీ జ‌బ‌ర్ద‌స్త్‌లోకి రీ ఎంట్రీ ఇస్తాడ‌ని అంటున్నారు. ఏదేమైనా సుధీర్ కొద్ది రోజులు జ‌బ‌ర్ద‌స్త్‌కు దూరంగా ఉన్నా కూడా సుధీర్ ఫ్యాన్స్ డిజ‌ప్పాయింట్ అవ్వ‌డం ఖాయం.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news