Gossipsశ‌ర్వానంద్‌కు కాబోయే భార్య ఆ హీరోకు బంధువేనా..!

శ‌ర్వానంద్‌కు కాబోయే భార్య ఆ హీరోకు బంధువేనా..!

టాలీవుడ్‌లో ఈ యేడాది లాక్‌డౌన్ ఇండ‌స్ట్రీకి అన్‌ల‌క్కీ అయినా హీరోల‌కు మాత్రం బ‌లే క‌లిసొచ్చిందిలే.. వ‌రుస పెట్టి హీరోలు పెళ్లి పీట‌లు ఎక్కేస్తున్నారు. దిల్ రాజు రెండో వివాహంతో ప్రారంభ‌మైన పెళ్లిళ్ల ప‌రంప‌ర‌లో ఇప్ప‌టికే నితిన్‌, నిఖిల్‌, రానాతో కంటిన్యూ అవుతోంది. ఇప్పుడు ఈ లిస్టులో యంగ్ హీరో శర్వానంద్ పేరు కూడా వినిపిస్తోంది. శ‌ర్వానంద్ ప్రేమ పెళ్లికి రెడీ అవుతున్న‌ట్టు వార్త‌లు వస్తోన్న సంగ‌తి తెలిసిందే. ఇక శ‌ర్వానంద్ చేసుకునే అమ్మాయి కొన్నేళ్ల నుంచి తెలిసిన ఆ అమ్మాయి మ‌నోడికి స్నేహితురాలు, ప్రియురాలు అట‌.

ఈ విషయం గురించి ఇండస్ట్రీలో చర్చ బాగా జరుగుతుంది. అయితే ఇక్క‌డే ఓ ఆస‌క్తిక‌ర‌మైన విష‌యం కూడా లీక్ అయ్యింది. శ‌ర్వాకు కాబోయే భార్య రామ్‌చ‌ర‌ణ్ భార్య ఉపాస‌న‌కు బంధువే అట‌. ఈ లెక్కన చెర్రీకి కూడా ఆమె బంధువే అవుతుంది క‌దా..!  చెర్రీ, శ‌ర్వా చిన్న‌ప్ప‌టి నుంచి కూడ బెస్ట్ ఫ్రెండ్స్‌… ఇప్పుడు వీరిద్ద‌రు ద‌గ్గ‌రి బంధువుల అమ్మాయిల‌నే పెళ్లాడ‌నున్నార‌న్న‌మాట‌.

ఇక అఖిల్‌కు ఎంగేజ్‌మెంట్ అయిన శ్రియా భూపాల్ కూడా ఉపాస‌న‌కు స‌మీప బంధువే. త‌ర్వాత వారి పెళ్లి ఎంగేజ్మెంట్‌తోనే క్యాన్సిల్ అయ్యింది. ఇక ఇప్పుడు శ‌ర్వానంద్‌కు కాబోయే భార్య కూడా ఉపాస‌న‌కు బంధువు అవ్వ‌డం విశేష‌మే. దీంతో చ‌ర‌ణ్‌, శ‌ర్వా మ‌రింత ద‌గ్గ‌ర‌వుతార‌న‌డంలో సందేహం లేదు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news