Moviesప‌వ‌న్ ఫ్యాన్స్‌కు జాత‌రే.. డేట్ వ‌చ్చేసింది..

ప‌వ‌న్ ఫ్యాన్స్‌కు జాత‌రే.. డేట్ వ‌చ్చేసింది..

ప‌‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ల్యాణ్ న‌టిస్తున్న తాజా చిత్రం వ‌కీల్ సాబ్‌. దిల్ రాజు నిర్మాణంలో వేణు శ్రీరామ్ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతోన్న ఈ సినిమా కోసం ప‌వ‌న్ అభిమానులు క‌ళ్లు కాయ‌లు కాచేలా వెయిట్ చేస్తున్నారు. ఈ క్ర‌మంలోనే ఈ సినిమా నుంచి అదిరిపోయే అప్‌డేట్ వ‌చ్చేసింది. వ‌కీల్‌సాబ్ మోష‌న్‌పోస్ట‌ర్ రిలీజ్ డేట్‌పై క్లారిటీ వ‌చ్చేసింది. బాలీవుడ్‌లో పింక్ సినిమాకు రీమేక్‌గా వ‌స్తోన్న ఈ సినిమా మోష‌న్ పోస్ట‌ర్ టీజ‌ర్ ప‌వ‌న్ పుట్టిన రోజు కానుక‌గా సెప్టెంబ‌ర్ 2న రిలీజ్ చేయ‌నున్నారు.

 

సెప్టెంబ‌ర్ 2న ప‌వ‌న్ పుట్టిన రోజు కావ‌డంతో అదే రోజు మోష‌న్ టీజ‌ర్‌ను వ‌దిలి అభిమానుల‌కు బ‌ర్త్‌డే ట్రీట్ ఇచ్చేందుకు వ‌కీల్ సాబ్ యూనిట్ సిద్ధ‌మ‌వుతోంది. ఇక రెండేళ్ల త‌ర్వాత అది కూడా అజ్ఞాత‌వాసి లాంటి డిజాస్ట‌ర్ త‌ర్వాత ప‌వ‌న్ న‌టిస్తోన్న సినిమా కావ‌డంతో ఈ సినిమా కోసం ప‌వ‌న్ అభిమానులే కాకుండా, టాలీవుడ్ సినీ అభిమానులు క‌ళ్లు కాయ‌లు కాచేలా వెయిట్ చేస్తున్నారు. ఇక సెప్టెంబ‌ర్ 2న ప‌వ‌న్ పుట్టిన రోజు కావ‌డంతో పాటు అదే రోజు టీజ‌ర్ కూడా రిలీజ్ కావ‌డంతో రెండిటిని ట్రెండ్ చేస్తూ ప‌వ‌న్ ఫ్యాన్స్ సోష‌ల్ మీడియాలో మోత మోగించేస్తున్నారు.

 

ఇక ఇప్ప‌టికే కౌంట్‌డౌన్ కూడా ప్రారంభించేశారు. ఇక థ‌మ‌న్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నారు. దీనిపై సోష‌ల్ మీడియా సాక్షిగా థ‌మ‌న్ హింట్ ఇవ్వ‌డంతో ఇప్పుడు ప‌వన్ బ‌ర్త్‌డే, వ‌కీల్‌సాబ్ టీజ‌ర్ గురించి మెగా అభిమానులు ట్రెండింగ్ ప్రారంభించేశారు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news