Gossipsకౌశల్ నిజ స్వరూపం ఇది.. ఎదురుతిరిగిన కౌశల్ ఆర్మీ..!

కౌశల్ నిజ స్వరూపం ఇది.. ఎదురుతిరిగిన కౌశల్ ఆర్మీ..!

బిగ్ బాస్ టైటిల్ విన్నర్ గా కౌశల్ చేసిన ఒంటరిపోరాటం అందరిని ఇంప్రెస్ చేసింది. అందుకే ఆయన హౌజ్ లో ఉండగా బయట అతనికి ఓ ఆర్మీ తయారైంది. హౌజ్ లో అతనికి నెగటివ్ మార్కులు పడిన ఫైనల్ గా కౌశల్ ఆర్మీ పుణ్యమాని టైటిల్ విన్నర్ అయ్యాడు కౌశల్ ఆర్మీ. ఇక బయటకు వచ్చాక ఈవెంట్లు, ప్రెస్ మీట్లు, రకరకాల కార్యక్రమాలు చేశారు. వీటన్నిటికి కౌశల్ ఆర్మీనే డబ్బులు ఖర్చు పెడుతుందని తెలిసిందే. అయితే ఇప్పుడు కౌశల్ ఆర్మీ సభ్యులే కౌశల్ పై నెగటివ్ కామెంట్స్ చేస్తున్నారు.

కౌశల్ ఆర్మీ ఫౌండర్ ఇమ్మాన్ అనే కౌశల్ పై విమర్శలు చేస్తున్నాడు. ఇక బిగ్ బాస్ లో గెలిచిన మొత్తాన్ని క్యాన్సర్ పేషెంట్స్ కోసం ఖర్చు పెడతాడని చెప్ప్పాడు కాని అలా చేయలేదని అదేమిటని ప్రశ్నిస్తే నా డబ్బు నా ఇష్టం వచ్చినట్టు ఖర్చు పెడతానని అన్నాడట. ఇంకా ఎక్కువ ప్రశ్నలేస్తే వారిపై కూడా ట్రోల్ చేయమని మిగతా ఫ్యాన్స్ కు చెబుతున్నాడట. కౌశల్ ఆర్మీలో సభ్యులైన అనామిక, హరిబాబు లాంటి వారు బిగ్ బాస్ లో ఉన్న కౌశల్ వేరు బయటకు వచ్చిన కౌశల్ వేరని.. ఎక్కడ ఈవెంట్ జరిగినా మా డబ్బులు ఖర్చు పెట్టిస్తాడని అతని నిజ స్వరూపం బయట పెట్టారు.

కౌశల్ కావాలని ఓ టివి ఛానెల్ ప్రోగ్రాం పిఎం తో చెప్పించి ఆపు చేయించానని ఫ్యాన్ తో మాట్లాడిన కాల్ రికార్డింగ్ తో బట్టబయలు అయ్యింది. మొత్తానికి బిగ్ బాస్ వల్ల ఏర్పడిన క్రేజ్ ను కౌశల్ ఆర్మీ రూపంలో వచ్చిన ఇమేజ్ ను కౌశల్ పాడు చేసుకున్నాడని తెలుస్తుంది. అప్పట్లో బిగ్ బాస్ ఇంటి సభ్యులంతా కౌశల్ మీద చేసిన ఒక్కో కామెంట్ ఇప్పుడు నిజమని నమ్మాల్సి వస్తుంది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news