Moviesకల్కి ఈవెంట్ లో పెళ్లి పై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసిన ప్రభాస్.....

కల్కి ఈవెంట్ లో పెళ్లి పై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసిన ప్రభాస్.. డార్లింగ్ టూ నాటీ అయిపోతున్నాడే..!

డార్లింగ్ ప్రభాస్ .. ఈ మధ్య అతి తెలివితేటలు ఎక్కువగా చూపిస్తున్నాడు అంటూ రెబెల్ ఫాన్స్ కూడా కామెంట్స్ చేస్తూ ఉండడం గమనార్హం . మనకు తెలిసిందే రీసెంట్గా ప్రభాస్ తన లైఫ్ లోకి స్పెషల్ పర్సన్ రాబోతుంది అంటూ ఓ పోస్ట్ పెట్టాడు . ఆ పోస్ట్ సెన్సేషన్ గా మారింది . అంతేకాదు అందరూ కూడా హీరోయిన్ అనుష్కతో పెళ్లి అంటూ తెగ ప్రచారం చేశారు . మరి కొందరు ఏకంగా బడా పొలిటీషియన్ మనవరాలతో పెళ్లి అంటూ తెగ హైలెట్ చేశారు.

సీన్ కట్ చేస్తే అదంతా కాదు అని అది కేవలం కల్కి సినిమా ప్రమోషన్స్ కోసమే చేశారు అని తేలిపోయింది . అదంతా కూడా బుజ్జిని ఇంట్రడ్యూస్ చేయడానికి చేసిన ఒక ప్లాన్ మాత్రమే అంటూ తేలిపోయింది తాజాగా రామోజీ ఫిలిం సిటీ లో ప్రభాస్ నటించిన కల్కి సినిమా ఈవెంట్ జరిగింది . ఈ ఈవెంట్లో ప్రభాస్ చాలా చక్కగా మాట్లాడారు . కాగా ఈ ఈవెంట్లో తన పెళ్లిపై తానే పంచ్ వేసుకుని అందర్నీ నవ్వించాడు .

ప్రభాస్ మాట్లాడుతూ..” కల్కి మూవీ ఈవెంట్ కు స్పెషల్ హోస్ట్ వస్తున్నారు అని నిర్మాతలు పెట్టిన పోస్ట్ కు చాలా మంది అమ్మాయిల హార్ట్ బ్రేక్ అయిపోయాయి .. ఆ విషయం నాకు తెలుసు ..వాళ్ళ హార్ట్శ్ బ్రేక్ చేయకూడదు అనే ఉద్దేశంతోనే పెళ్లి చేసుకోవడం లేదు ..ఓకేనా డార్లింగ్ అంటూ సరదాగా నవ్వించేశాడు”. అంతేకాదు ప్రభాస్ ఇప్పట్లో పెళ్లి చేసుకుంటాడు అన్న ఆలోచనలో కూడా లేనట్లు ఆయన మాటలు ఆధారంగా తెలుస్తుంది . ప్రస్తుతం దీనికి సంబంధించిన న్యూస్ వైరల్ గా మారింది. ఈ ప్రభాస్ పెళ్లి చేసుకుంటాడో లేదో కానీ సోషల్ మీడియాలో మాత్రం ప్రభాస్ పెళ్లి వార్త బాగా హాట్ హాట్ గా ట్రెండ్ అవుతుంది. ప్రజెంట్ కల్కి సినిమా ప్రమోషన్స్ లో బిజీ బిజీగా గడిపేస్తున్నాడు ఈ రెబల్ హీరో..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news