Moviesచరణ్ కి తల్లిగా విజయశాంతి..ఆమెకు భర్తగా ఎవరు నటిస్తున్నారు తెలుసా..? బుచ్చిబాబు...

చరణ్ కి తల్లిగా విజయశాంతి..ఆమెకు భర్తగా ఎవరు నటిస్తున్నారు తెలుసా..? బుచ్చిబాబు కేక పెట్టించే ప్లాన్ అద్దిరిపోయిందిగా..!

మనకు తెలిసిందే ..మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రెసెంట్ బుచ్చిబాబు సనా దర్శకత్వంలో ఒక సినిమాకి కమిట్ అయి ఉన్నాడు . త్వరలోనే ఈ సినిమాను సెట్స్ పైకి తీసుకురాబోతున్నారు . ఇప్పటికే ఈ సినిమాకి సంబంధించిన పూజా కార్యక్రమాలు గ్రాండ్గా జరిగాయి . కాగా ఈ సినిమాలో బాలీవుడ్ అందాల ముద్దుగుమ్మ జాన్వి కపూర్ హీరోయిన్గా నటిస్తుంది . అంతేకాదు ఈ సినిమాలో మరొక హాట్ బ్యూటీ కూడా ఉంటుంది అని ఆ హాట్ బ్యూటీ కోసం జనాలు వెయిట్ చేయాల్సిందే అని మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఫ్యాన్స్ చెప్పుకొస్తున్నారు .

అందుతున్న సమాచారం ప్రకారం .. ఈ సినిమాలో సెకండ్ హీరోయిన్ గా లేటెస్ట్ సెన్సేషన్ మమిత బైజు నటించబోతుందట . సోషల్ మీడియాలో ఈ వార్త బాగా ట్రెండ్ అవుతుంది. అయితే ఇది మొత్తం స్పోర్ట్స్ డ్రామా కి సంబంధించిన సినిమాగా తెరకెక్కుతుందట. ఈ సినిమాలో విజయశాంతి.. రామ్ చరణ్ కి తల్లిగా నటించబోతుందట. ఆశ్చర్యం ఏంటంటే రామ్ చరణ్ కి తండ్రి పాత్రలో చిరంజీవిని నటింపజేయాలి అంటూ బుచ్చిబాబు సనా ట్రై చేస్తున్నారట.

వీళ్ళిద్దరి కాంబో ఎంత సూపర్ డూపర్ హిట్ అవుతుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . రామ్ చరణ్ – చిరంజీవి కాంబో ప్లాప్ అయినా.. విజయశాంతి – చిరంజీవి కాంబో మాత్రం అభిమానులకి ఎవర్గ్రీన్ కాంబోగా నిలిచిపోతుంది . మరొక్కసారి వీళ్లు జత కడితే మాత్రం బొమ్మ బ్లాక్ బస్టర్ అవ్వాల్సిందే అంటున్నారు మెగా ఫాన్స్.. త్వరగా ఆ పని పూర్తిచేయి అంటూ బుచ్చిబాబు సనాకు సజెషన్స్ ఇస్తున్నారు. చూద్దాం మరి సుకుమార్ శిష్యుడు ఏం చేస్తాడో..??

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news