Gossipsరామ్ చరణ్ బుర్రే ..బుర్ర .. నమ్మాడు.. గెలిచాడు.. వదిలాడు ...తప్పించుకున్నాడు...

రామ్ చరణ్ బుర్రే ..బుర్ర .. నమ్మాడు.. గెలిచాడు.. వదిలాడు …తప్పించుకున్నాడు !!

మెగా స్టార్ చిరంజీవి తనయుడిగా తెరంగేట్రం చేసినప్పటికీ రెండో సినిమాతోనే ఇండస్ట్రీ హిట్ కొట్టి తన సత్తా చాటుకున్న రామ్ చరణ్ కొన్నాళ్ల క్రితం వరుస ప్లాప్స్ తో కొంత ఇబ్బంది పడ్డాడు. ఏ సినిమా ఆడుతుంది .. ఏ కథ తన రేంజ్ లో ఉంటుంది .. అనే జడ్జిమెంట్ విషయంలో తన పంథా మార్చుకొని వరుసగా ధృవ తో సూపర్ హిట్ , రంగస్థలం తో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టేశాడు. సినిమాలు హిట్లు అయ్యాయి కాబట్టి రామ్ చరణ్ ని మనం మెచ్చుకోవచ్చు. కానీ అందరికీ తెలియాల్సిన విషయం ఏంటంటే హిట్ల కథలను ఎంచుకోవడంలోనే కాదు మనోడు తనదగ్గరికి వచ్చిన ప్లాప్ కథలను తిరస్కరించడం లోనూ ఎంతో చాకచక్యంగా వ్యవహరించడంతో భారీ పరాజయాలనుండి తప్పించుకున్నాడు.

ఈ మధ్య నాని డబల్ రోల్ లో చేసిన కృష్ణార్జున యుద్ధం సినిమా కథ మొదటగా రామ్ చరణ్ దగ్గరకు వచ్చిన కథనే. వరుసగా రెండు హిట్లు కొట్టిన మేర్లపాక గాంధీ ఈ కథని మొదటగా రామ్ చరణ్ కి వినిపించాడట. డబల్ రోల్ ఇప్పట్లో చేయడం ఇష్టం లేదని సున్నితంగా తిరస్కరించిందట రామ్ చరణ్. తర్వాత నాని తో తీసిన ఈ సినిమా రిజల్ట్ ఏమైందో అందరికీ తెలిసిన విషయమే.

ఇక వరుసగా రెండు డీసెంట్ హిట్లతో మంచి ఫామ్ లో ఉన్న కళ్యాణ్ కృష్ణ కూడా తన నేల టిక్కెట్టు సినిమాకి మొదటగా రామ్ చరణ్ నే అనుకున్నాడట. కథ కూడా చెప్పాడట. రామ్ చరణ్ ఈ సినిమా విషయంలో కూడా తన బుర్రకి పని చెప్పి తనకి ఈ కథ సెట్ కాదని చెప్పి తిరస్కరించాడు. ఈ సినిమా ఈ మధ్యనే విడుదలయి రవితేజ కెరీర్ లోనే బిగ్గెస్ట్ డిజాస్టర్ గా నిలవబోతున్న సంగతి తెలిసిందే.

అలాగే ధృవ సినిమా రీమేక్ వద్దని , సుకుమార్ తో కూడా చెవిటి వాడి గా సినిమా వద్దని చాలామంది రామ్ చరణ్ ని వారించారట .రామ్ చరణ్ నమ్మాడు.. వాటి రిజల్ట్ ఏమైందో మీకు ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.

అందుకే అంటారు ఊరకనే అయిపోరు స్టార్ హీరోలు అని .. తమ సినిమాల ఎంపిక విషయంలో తమ బుర్రకి పని చెప్పకపోతే ఇటువంటి పరాజయాలనే చవిచూడాల్సి వస్తుంది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news