Moviesఆఫీసర్ సెన్సార్ రివ్యూ.. డైలమాలో నాగ్ ఫ్యాన్స్

ఆఫీసర్ సెన్సార్ రివ్యూ.. డైలమాలో నాగ్ ఫ్యాన్స్

సంచలన దర్శకుడు రాం గోపాల్ వర్మ, కింగ్ నాగార్జున కాంబినేషన్ లో దాదాపు పాతికేళ్ల తర్వాత వస్తున్న సినిమా ఆఫీసర్. నాగ్ పోలీస్ పాత్రలో కనిపిస్తున్న ఈ సినిమా నిన్న సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుంది. సెన్సార్ సభ్యులు ఆఫీసర్ సినిమాకు యు/ఏ సర్టిఫికెట్ ఇవ్వడం విశేషం.

వర్మ సినిమాలకు డైరెక్ట్ గా ఏ ఇచ్చేస్తారు. కాని నాగార్జున హీరో కాబట్టి కాస్త తగ్గినట్టున్నాడు. ఇక ఈ సినిమా ముంబై పోలీస్ ఆఫీసర్ ప్రసన్న కుమార్ రియల్ స్టోరీ స్పూర్తితో రాసుకున్నాడట వర్మ. అలానే సినిమాలో మంచి ఇంటెన్స్ ను చూపించారట. ఇక కొన్నాళ్లుగా యాక్షన్ సినిమాలకు దూరంగా ఉన్న నాగార్జున ఆఫీసర్ తో తన ఫ్యాన్స్ ను ఖుషి చేయనున్నాడు.

జూన్ 1న రిలీజ్ అవుతున్న ఈ సినిమాలో మైరా సరీన్ హీరోయిన్ గా నటించింది. కంప్లీట్ యాక్షన్ మూవీగా రాబోతున్న ఈ సినిమా ఫలితంపై గట్టి నమ్మకంతో ఉన్నాడు వర్మ. శివ కాంబో కాబట్టి సిని ప్రేమికులు కూడా ఈ ఆఫీసర్ పై అంచనాలు పెట్టుకున్నారు. మరి అవి ఎంతవరకు నిజం అవుతాయో మరో నాలుగు రోజులు ఆగితే సరిపోతుంది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news