Gossipsఎన్టీఆర్ పై మనసు విప్పిన భామ..!

ఎన్టీఆర్ పై మనసు విప్పిన భామ..!

యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్ నటన గురించి ఎంత చెప్పినా తక్కువే. నవరస నటనా చాతుర్యం ఆయన సొంతం అందుకే స్టార్ గా ఎదిగారు. కేవలం ప్రేక్షకులే ఎన్.టి.ఆర్ అభిమానులు కాదు సిని సెలబ్రిటీస్ కు కూడా ఎన్.టి.ఆర్ అంటే చాలా ఇష్టం. ఇప్పుడున్న యువ హీరోలలో ఎవరిని అడిగినా తారక్ అంటే ఇష్టమని చెబుతారు.

ఇక ఇదే విషయాన్ని హీరోయిన్స్ కూడా చెబుతారు. ఈ క్రమంలో రాజ్ తరుణ్ రంగులరాట్నంలో నటించిన చిత్ర శుక్లా కూడా ఎన్.టి.ఆర్ ను పొగడ్తలలో ముంచెత్తింది. ఇండియన్ సినిమాలో ఎన్.టి.ఆర్ వన్ ఆఫ్ ది బెస్ట్ ఆల్ రౌండర్ తన ఫేవరేట్ స్టార్ ఎన్.టి.ఆర్ అంటుంది చిత్ర శుక్ల. శ్రీవిష్ణు మా అబ్బాయి సినిమాతో హీరోయిన్ గా పరిచయమైన చిత్ర శుక్ల రాజ్ తరుణ్ రంగుల రాట్నంలో నటించి మెప్పించింది.

ప్రస్తుతం తెలుగులో అవకాశాల కోసం ఎదురుచూస్తున్న ఈ అమ్మడు ఎన్.టి.ఆర్ ఇండియాలోనే బెస్ట్ ఆల్రౌండర్ అని నందమూరి ఫ్యాన్స్ ను హుశారెత్తించేలా చేసింది. WhatsApp Image 2018-05-30 at 8.46.20 AM

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news