Moviesరానాకు పార్శిల్ ..

రానాకు పార్శిల్ ..

అదిగో పులి.. ఇదిగో పులి అనే కథ విన్నాం కథ. అచ్చం అలాంటిదే హైదరాబాద్ లో జరిగింది. అక్కడ అడవిలో నాన్న పులి అయితే.. ఇక్కడ సినీ ఇండస్ట్రీ డ్రగ్స్–ఎక్సైజ్ శాఖ మధ్య జరిగింది. నెల రోజులుగా డ్రగ్స్ కేసు విచారణలో మునిగితేలిన ఎక్సైజ్ అధికారులకు బుధవారం ఉదయం ఓ సమాచారం వచ్చింది. హీరో రానాకి విదేశాల నుంచి ఓ పార్సిల్ వచ్చింది. అందులో ఏదో మెత్తగా ఉంది అనేది దీని సారాంశం. ఇప్పటికే విదేశీ కొరియర్స్ పై గట్టి నిఘా పెట్టిన ఆఫీసర్స్ హడావిడిగా జీపులో బయలుదేరారు. ఎక్సైజ్ సీఐ కనకదుర్గ ఆధ్వర్యంలో ఓ టీం రామానాయుడు స్టూడియోకి వచ్చారు.

అధికారుల రాకతో స్టూడియో టెన్షన్. వచ్చిన అధికారులు నేరుగా ఆఫీస్ లోకి వెళ్లారు. విదేశాల నుంచి వచ్చిన పార్సిల్ చూడాలని కోరారు. దాన్ని చెక్ చేసుకున్న ఎక్సైజ్ అధికారులు ఖంగుతిన్నారు. అందులో ఓ మెడికల్ కిట్ ఉంది. నడుం నొప్పి కోసం దాన్ని ఉపయోగిస్తుంటారు. విదేశాల్లో ప్రత్యేకంగా దొరికే ఈ పరికరాన్ని ఆన్ లైన్ లో బుక్ చేసుకున్నారు రానా. దీన్ని పరిశీలించిన అధికారులు డ్రగ్స్ ఏమీ లేవని నిర్ధారించుకుని వెళ్లిపోయారు. దగ్గుబాటి సురేష్ బాబు కూడా స్పందించారు. పార్సిల్ వచ్చిన మాట వాస్తవమే అని.. అది మెడికల్ కిట్ అని చెప్పారు. స్టూడియోకి వచ్చిన పార్సిల్ ను ఎక్సైజ్ అధికారులు కూడా పరిశీలించారని వివరించారు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news