Moviesఓవర్సీస్ లో మహేష్ సత్తా ఇది.. ఏ హీరో టచ్ చేయని...

ఓవర్సీస్ లో మహేష్ సత్తా ఇది.. ఏ హీరో టచ్ చేయని రికార్డ్..!

సూపర్ స్టార్ మహేష్ కు తెలుగు రెండు రాష్ట్రాల్లో ఏ రేంజ్ ఫాలోయింగ్ ఉంటుందో ఓవర్సీస్ మార్కెట్ కూడా అదే రేంజ్ లో ఉంటుంది. అక్కడ మొదట మిలియన్ కలక్షన్స్ జోరు పెంచింది మహేష్ బాబే అని చెప్పాలి. అందుకే మహేష్ సినిమా ఇక్కడ వసూళ్లు ఎలా ఉన్నా ఓవర్సీస్ లో మాత్రం వసూళ్ల వరద పారుతుంది.
ప్రస్తుతం మహేష్ నటిస్తున్న మురుగదాస్ స్పైడర్ కు రికార్డ్ ప్రైజ్ కు అక్కడ రైట్స్ అమ్ముడయ్యాయట. నిన్న మొన్నటిదాకా 10-12 కోట్ల వరకే ఉన్న ఓవర్సీస్ మార్కెట్ మహేష్ స్పైడర్ కోసం ఏకంగా 15.2 కోట్లకు కొనేశారట.

ఓ ప్రముఖ డిస్ట్రిబ్యూషన్ సంస్థ స్పైడర్ ను భారీ మొత్తానికి కొనేసిందట. మహేష్ కెరియర్ లో ఈ రేంజ్ లో రైట్స్ అమ్ముడవడం మొదటిసారి అని చెప్పాలి. మహేష్ స్పై ఏజెంట్ గా కనిపించబోతున్న ఈ సినిమాలో రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ గా నటిస్తుంది. ఓవర్సీస్ లో మహేష్ రైట్స్ రూపంలో సత్తా చాటగా ఆ రికార్డును కలక్షన్స్ తో కూడా సమం చేస్తే అది మరింత సంచలనంగా మారుతుంది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news