Moviesబోయపాటి 'లెజెండ్' స్పీచ్ కి చాలా మంది ఒళ్ళు మండింది

బోయపాటి ‘లెజెండ్’ స్పీచ్ కి చాలా మంది ఒళ్ళు మండింది

ఆడియో వేడుకలలో ఒకప్పుడు హీరోల స్పీచ్ లు అద్భుతంగా సాగేవి ఇప్పుడు మాత్రం డైరెక్టర్ లు హీరోల స్థానాన్ని కవర్ చేస్తూ మాట్లాడుతున్నారు. దువ్వాడ జగన్నాథం ఆడియో , సక్సెస్ మీట్ లలో డైరెక్టర్ హరీష్ శంకర్ తనదైన శైలి లో రెచ్చిపోయిన సంగతి తెలిసిందే. తాజాగా జయ జానకీ నాయక ఆడియో లో బోయపాటి కూడా తన స్పీచ్ తో విశ్వరూపం చూపించారు.సాధారణంగా ఆడియో వేడుకలలో ఎక్కువ మాట్లాడుతూ ఉండడం బోయపాటికి చాలా అలవాటు ఐన వ్యవహారం. బాలయ్య తో తాను తీసిన లెజెండ్ సినిమా ప్రస్తావన తెసుకుని వచ్చి మరీ ఆయన తెలుగు సినిమాకి ఆ చిత్రం గర్వకారణం అంటూ చెప్పుకొచ్చారు. విశ్వనాథ్ కి దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు గురించి చెప్పిన ఆయన తెలుగువారికి గర్వ కారణం అన్నారు..

అది ఓకే అనుకుంటే ఆ తరవాత బాహుబలి సినిమా ప్రపంచ వ్యాప్తంగా తెలుగు జనాలు గర్వించేది గా ఉంది అన్నారు. అది కూడా సరేలే అనుకుంటే చిరు తో త్వరలో సినిమా చేయ్యబోతునట్టు మాట్లాడారు. ఇక లెజెండ్ సినిమా వెయ్యి రోజులు ఆడడం గురించి గొప్పగా చెప్పుకున్నారు ఆయన. ఆ సినిమా అలా రన్ అవడం తెలుగు జాతికి గర్వకారణం అన్నారు ఆయన. ఆ మాట వినగానే జనాలు ముక్కున వేలు వేసుకున్నారు. ఆ సినిమా ఆడిందా ఆడించారా అని జనాలు ఆ మాత్రం అర్ధం చేసుకునే పరిస్థితి లో లేరా ? ఇలాంటి గొప్పలు ఇంకెన్నాళ్ళు చెబుతారు ?

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news