Moviesసుకుమార్ ఎంత చేసినా లాభం లేదండి..!

సుకుమార్ ఎంత చేసినా లాభం లేదండి..!

దర్శకుడిగా మంచి ఫాంలో ఉన్న సుకుమార్ సడెన్ గా నిర్మాతగా మారాలన్న ఆలోచన వచ్చింది. రావడమే కాదు తను రాసుకున్న కుమారి 21ఎఫ్ సినిమాను సూర్య ప్రతాప్ చేత డైరెక్ట్ చేయించి సూపర్ హిట్ అందుకున్నాడు. సుకుమార్ రైటింగ్స్ ప్రొడక్షన్ నుండి రెండో సినిమాగా దర్శకుడు వస్తుంది. ఈ శుక్రవారం రిలీజ్ అవబోతున్న ఈ సినిమా కొత్త దర్శకుడు కొత్త హీరో కావడం చేత అంత బజ్ ఏర్పడటం లేదు.సినిమా ప్రేక్షకుల్లోకి తీసుకెళ్లే ప్రయత్నంలో చరణ్, ఎన్.టి.ఆర్, అల్లు అర్జున్ లాంటి స్టార్స్ ను వాడినా ఎబ్బే ఈ సినిమాకు ఏమాత్రం హైప్ రావడం లేదు.

అయితే బజ్ వచ్చినా రాకున్నా ఈ కథ మాత్రం తప్పకుండా క్లిక్ అవుతుందని సుకుమార్ ఇప్పటికి ఫుల్ కాన్ఫిడెన్స్ తో ఉన్నాడట. అందుకే హరి ప్రసాద్ కథ చెప్పగానే కథను ఓకే చేసి అతన్నే డైరెక్టర్ గా ఫిక్స్ చేశాడు.సుకుమార్ క్రియేటివిటీ తెలిసిందే మరి అలాంటి దర్శకుడినే ఇంప్రెస్ చేసే కథ అంటే కచ్చితంగా సక్సెస్ అయినట్టే. మరి రిలీజ్ ముందు హైప్ లేకున్నా రిలీజ్ తర్వాత అయినా సరే దర్శకుడు క్రేజ్ సంపాదిస్తాడేమో చూడాలి. ఈషా రెబ్బ హీరోయిన్ గా నటించిన ఈ సినిమాకు సాయి కార్తిక్ మ్యూజిక్ అందించారు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news