వామ్మో .. ఏంటిది ఇక్కడ మనం చూస్తుంది డార్లింగ్ ప్రభాస్ నేనా ..? ఎస్ ప్రెసెంట్ ఇలాంటి కామెంట్స్ తోనే రెబల్ అభిమానులను సోషల్ మీడియాలో ప్రభాస్ సంబంధించిన వీడియోని బాగా ట్రెండ్ చేస్తున్నారు. మనం ప్రభాస్ ని డైరెక్ట్ గా చూసింది ఈ మధ్యకాలంలో అస్సలు లేదు. అప్పుడెప్పుడో సలార్ సినిమా ప్రమోషన్స్‌లో కనిపించిన ప్రభాస్ .. ఆ తర్వాత అడ్రస్ లేకుండా పోయాడు .
రీసెంట్గా ప్రభాస్ కి సంబంధించిన ఒక వీడియో సోషల్ మీడియాని షేక్ చేస్తుంది. వైట్ టీషర్ట్ లో తలకు క్యాప్ పెట్టుకొని బాగా బరువు తగ్గిపోయి .. చూడడానికి చాలా హ్యాండ్సమ్ గా తయారయ్యాడు . ఎలా అంటే గతంలో మిర్చి సినిమాలో ప్రభాస్ ని మనం ఎలా చూసామో..? అదే విధంగా కనిపిస్తున్నాడు . చాలా చాలా హ్యాండ్సమ్ గా తయారైపోయాడు. ప్రభాస్ ని ఈ లుక్స్ లో చూసిన ఏ అమ్మాయి అయినా సరే ఫిదా అయిపోవాల్సిందే . అలాంటి రేర్ లుక్స్ లో కనిపించాడు.
అయితే గతంలో ప్రభాస్ బరువుకి .. ఇప్పుడు బరువుకి చాలా తేడా ఉంది. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న న్యూస్ ప్రకారం దాదాపు ప్రభాస్ 10 కేజీల బరువుని తగ్గాడట. అది కూడా సలార్ 2 సినిమా కోసమే అంటూ ప్రచారం జరుగుతుంది . అంతేకాదు ప్రభాస్ తన నెక్స్ట్ సినిమాల విషయంలో చాలా కేర్‌ఫుల్ గా ఉన్నాడట. అంతేకాదు మిస్టర్ పర్ఫెక్ట్ – డార్లింగ్ – మిర్చి లెవెల్ లోనే నెక్స్ట్ సినిమాలను ఫుల్ రొమాంటిక్ లవబుల్ కాన్సెప్ట్ తో ఉండేలా చూస్ చేసుకున్నారట . మరీ ముఖ్యంగా హనురాఘవపూడి దర్శకత్వంలో తెరకెక్కే సినిమా .. ప్రభాస్ కెరియర్ లోనే మరో మైల్ స్టోన్ క్రియేట్ చేయబోతుంది అంటూ ప్రచారం జరుగుతుంది . దీంతో ప్రభాస్ కి సంబంధించిన లేటెస్ట్ వీడియో వైరల్ గా మారింది..!!
VINTAGE #PRABHAS IS BACK 🥵🥵🥵🥵🔥🔥🔥🔥🔥
— GetsCinema (@GetsCinema) April 17, 2024
Maintaining LEAN BODY ✅
pic.twitter.com/e7cQ2HG9wE