Moviesరెబల్ ఫ్యాన్స్ కి ఫ్యూజులు ఎగిరిపోయే న్యూస్.. ఆ క్రేజీ డైరెక్టర్...

రెబల్ ఫ్యాన్స్ కి ఫ్యూజులు ఎగిరిపోయే న్యూస్.. ఆ క్రేజీ డైరెక్టర్ తో కమిట్ అయిన ప్రభాస్.. ఈ కాంబోను అసలు ఊహించలేరుగా..!

ప్రభాస్ ..ఆరడుగుల అందగాడు రెబల్ హీరోగా బాగా పాపులారిటీ సంపాదించుకున్నాడు . మరీ ముఖ్యంగా పాన్ ఇండియా స్థాయిలో గుర్తింపు సంపాదించుకున్నాడు . బాహుబలి సినిమా తర్వాత ప్రభాస్ రేంజ్ ఆఫ్ ఫ్యాన్ ఫాలోయింగ్ రెమ్యూనరేషన్ స్టేటస్ అన్ని పెరిగిపోయిన విషయం తెలిసిందే. మరీ ముఖ్యంగా బడా బడా డైరెక్టర్లు కూడా ఈయనతో సినిమాలు తెరకెక్కించడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఇప్పటికే ప్రభాస్ ఖాతాలో నాలుగు భారీ సినిమాలో ఉన్నాయి . ఈ నాలుగు భారీ సినిమాలు పూర్తయ్యేసరికి మూడు ఏళ్ళు అయినా పడుతుంది.

మరోపక్క ప్రభాస్ పెళ్లి ఏజ్ కూడా దాటిపోతుంది. ఆయన ఎప్పుడు పెళ్లి చేసుకుంటాడా..? అంటూ ఫ్యాన్స్ ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు . అయితే పెళ్లి విషయాని పక్కన పెట్టేసి ప్రభాస్ మాత్రం తన సినిమాల పనుల్లో బిజీగా ముందుకెళ్ళిపోతున్నాడు . ప్రజెంట్ కల్కి సినిమా షూట్ లో బిజీగా ఉన్నాడు . అదేవిధంగా కూడా రాజా సాబ్ షూట్ కంప్లీట్ చేసే పనిలో ఉన్నాడు . అంతే కాదు ఈ రెండు కంప్లీట్ అయిన వెంటనే..అదేవిధంగా సందీప్ రెడ్డివంగా దర్శకత్వంలో తెరకెక్కే స్పిరిట్ సినిమాను కూడా సెట్స్ పైకి తీసుకురావాలన్న ఆలోచనలో ఉన్నాడు .

ఈ ఇద్దరు సినిమాలు కమిట్ అయిపోగానే హను రాఘవపూడితో ఒక క్రేజీ లవ్ స్టోరీ కమిట్ అయ్యాడు . అయితే ఈ సినిమా ఇంకా సెట్స్ పైకి రాకముందే మరో క్రేజీ డైరెక్టర్ తో సినిమాకి ఫిక్స్ అయినట్లు వార్తలు వినిపిస్తున్నాయి . ఆయన మరెవరో కాదు అట్లీ. ఇదే న్యూస్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది . జవాన్ సినిమాతో బాగా పాపులారిటీ సంపాదించుకున్న అట్లీ ..అల్లు అర్జున్ తో క్రేజీ సినిమాను తెరకెక్కించడానికి సిద్ధంగా ఉన్నాడు అంటూ వార్తలు వినిపిస్తున్నాయి .

అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమా బిగ్ మల్టీస్టారర్ మూవీగా తెరకెక్కబోతుందట . ఈ సినిమాలో అల్లు అర్జున్ తో పాటు ప్రభాస్ కూడా నటించబోతున్నారట. ఇది మొత్తం ఫ్రెండ్షిప్ సినిమా అని ..సినిమా సూపర్ డూపర్ హిట్ అవుతుంది అని .. మరీ ముఖ్యంగా ఆర్ఆర్ఆర్ సినిమా తర్వాత ఈ సినిమా అలాంటి క్రేజీ రికార్డ్స్ నెలకొల్పుతుంది అని ధీమా వ్యక్తం చేస్తున్నారు ఫ్యాన్స్..!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news