Moviesబన్నీ అసిస్టెంట్ డైరెక్టర్ గా వర్క్ చేసిన ఏకైక ఫిలిం ఇదే.....

బన్నీ అసిస్టెంట్ డైరెక్టర్ గా వర్క్ చేసిన ఏకైక ఫిలిం ఇదే.. లైఫ్ లో ఎంత స్పెషల్ అంటే..?

బన్నీ.. అల్లు అర్జున్ ..టాలీవుడ్ ఇండస్ట్రీలో ఐకాన్ స్టార్ గా స్టైలిష్ స్టార్ గా తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నాడు. ఈయన గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే . పుష్ప2 సినిమాతో గ్లోబల్ స్థాయిలో గుర్తింపు సంపాదించుకోవడానికి సిద్ధమవుతున్నాడు. పుష్పవన్ సినిమాతో పాన్ ఇండియా లెవెల్లో పాపులారిటీ దక్కించుకున్న పుష్ప2 తో చరిత్ర తిరగ రాయడానికి సిద్ధమవుతున్నాడు . ఆగస్టు 15వ తేదీ ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్గా రిలీజ్ కాబోతుంది .

ఇలాంటి క్రమంలోనే బన్నీకి సంబంధించిన కొన్ని డీటెయిల్స్ వైరల్ అవుతున్నాయి . బన్నీ తన కెరియర్లో అసిస్టెంట్ డైరెక్టర్గా చేసిన ఒకే ఒక్క సినిమాకి సంబంధించిన విషయాలు నెట్టింట బాగా ట్రెండ్ అవుతున్నాయి . “పెళ్ళాం ఊరెళితే”.. ఈ సినిమా గురించి ప్రత్యేకంగా చెప్పుకో అక్కర్లేదు . ప్రతి ఒక్క ఫ్యామిలీకి బాగా కనెక్ట్ అయిన సినిమా . ఎస్వీ కృష్ణారెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాకు వన్ ఆఫ్ ద ప్రొడ్యూసర్ గా అల్లు అరవింద్ ఉన్నారు .

ఆ టైంలోనే అల్లు అర్జున్ ని ఈ సినిమాకి అసిస్టెంట్ డైరెక్టర్గా వర్క్ చేయించారట. అయితే మొదటినుంచి ఎస్వి కృష్ణారెడ్డి రూల్స్ రెగ్యులేషన్స్ డేడికేషన్ అంటే అల్లు అర్జున్ కి భలే భయమట . అందుకే ఈ విషయంలో ఆయన చాలా చాలా జాగ్రత్తగా ఉన్నారట . సినిమా షూట్ కి కరెక్ట్ టయానికి వెళ్లడం లాంటివి చేసేవారట. ప్రజెంట్ ఇదే న్యూస్ సినిమా ఇండస్ట్రీలో వైరల్ గా మారింది .ఒకప్పుడు అసిస్టెంట్ డైరెక్టర్గా వర్క్ చేస్తున్న బన్నీ త్వరలోనే ప్రపంచాన్ని శాసించే హీరోగా మారబోతున్నాడు అంటున్నారు అభిమానులు..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news