Moviesప్రతి పండగని మెగా ఫ్యామిలీ అంతా కలిసి జరుపుకోవడానికి కారణం అదే.....

ప్రతి పండగని మెగా ఫ్యామిలీ అంతా కలిసి జరుపుకోవడానికి కారణం అదే.. టాప్ సీక్రెట్ లీక్ చేసిన మెగాస్టార్..!!

ఇంట్లో ఉండే అమ్మానాన్ననే పట్టించుకోని జనరేషన్ ఇది.. బిజీ షెడ్యూల్ తో కాల్ షీట్స్ తో వర్క్ షీట్స్ తో తినడానికి సమయం కూడా లేకుండా నేటి ప్రపంచంతో దూసుకుపోతున్నారు జనాభా . మరి ఇలాంటి మూమెంట్లోనూ కుటుంబ పెద్దలకు గౌరవం ఇస్తూ సాంప్రదాయాలకు పెద్దపీట వేస్తూ ప్రతి పండగని కుటుంబం అంతా కలిసి జరుపుకోవడం అంటే పెద్ద సాహసం అనే చెప్పాలి . అలాంటి సాహసాన్ని చాలా ఈజీగా చేసేసాడు మెగాస్టార్ చిరంజీవి .

ఈవెంట్ చిన్నదైనా పెద్దదైన ప్రతి పండగకి మెగా ఫ్యామిలీ అంతా ఒకే చోట కలుస్తుంది . సరదాగా ఆ రోజును బాగా సెలబ్రేట్ చేసుకుంటుంది . దానికి సంబంధించిన పిక్చర్స్ కూడా సోషల్ మీడియాలో బాగా ట్రెండ్ అవుతూ ఉంటాయి. రీసెంట్గా సోషల్ మీడియాలో అలా ఎందుకు ఆయన ఫ్యామిలీతో కలిసి ప్రతి ఈవెంట్ ప్రతి పండగను సెలబ్రేట్ చేసుకుంటారు అనే విషయం బాగా వైరల్ గా మారింది .

ఫ్యామిలీ స్టార్ సినిమాతో మన ముందుకు రాబోతున్న విజయ్ దేవరకొండ రీసెంట్గా చిరంజీవితో చిట్ చాట్ చేశాడు. ఈ క్రమంలోనే ఆయన ఎందుకు ఫ్యామిలీకి అంత ఇంపార్టెన్స్ ఇస్తాడు అనే విషయాన్ని బయట పెట్టాడు . విజయ్ దేవరకొండ ప్రశ్నిస్తూ” ఫ్యామిలీ బాండింగ్స్ కి మీరు ఎక్కువ విలువ ఇస్తారు.. ఎందుకు..?”.. అని ప్రశ్నించగా .. తన ఫ్యామిలీ స్టార్ తన తండ్రి అని ..ఆయన చెప్పిన విధంగానే నేను ఫాలో అవుతున్నాను అని.. కుటుంబంలో గొడవలు విభేదాలు ఉండొచ్చు ..కానీ ఒక్కసారి అందరం కలుసుకుంటే అవన్నీ తొలగిపోతాయి అందుకే మేము ఏ పండుగ అయినా సరే బాగా సెలబ్రేట్ చేసుకుంటాము అంటూ చెప్పుకొచ్చారు. దీంతో ఈ న్యూస్ బాగా ట్రెండ్ అవుతుంది..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news