Movies"ఆరోజు అలా జరిగి ఉంటే..చిరంజీవి అస్సలు హీరో అయ్యేవాడే కాదా..? సంచలన...

“ఆరోజు అలా జరిగి ఉంటే..చిరంజీవి అస్సలు హీరో అయ్యేవాడే కాదా..? సంచలన విషయాని బయటపెట్టిన మెగాస్టార్..!

సినిమా ఇండస్ట్రీలో మెగాస్టార్ అనగానే ఎలాంటి ఒక కొత్త వైబ్ కనిపిస్తుందో మనకు తెలిసిందే. అలాంటి మెగాస్టార్ చిరంజీవి ఇండస్ట్రీలోకి రావడానికి గల కారణం తెలుసుకోవాలని అందరికీ ఉంటుంది . అసలు చిరు ఎందుకు హీరో అవ్వాలి అనుకున్నాడు ..?నిజంగానే హీరోగా సక్సెస్ అవుతాడు అని అనుకున్నాడా..? ఆయనకి ఎవరు హెల్ప్ చేశారు ..?ఇలాంటి విషయాలను తాజాగా ఓ చిట్ చాట్ లో బయట పెట్టాడు మెగాస్టార్ .

విజయ్ దేవరకొండ హీరోగా నటిస్తున్న తాజా సినిమా ఫ్యామిలీ స్టార్ . ఏప్రిల్ 5వ తేదీ ఈ సినిమా థియేటర్స్ లో గ్రాండ్గా రిలీజ్ కాబోతుంది . ఈ క్రమంలోనే సినిమా ప్రమోషన్స్ లో భాగంగా చిరంజీవితో ఒక చిన్న చిట్ చాట్ చేశాడు విజయ్. ఈ క్రమంలోనే విజయ్ దేవరకొండ మెగాస్టార్ ను ప్రశ్నిస్తూ “మీరు ఎప్పుడైనా మెగాస్టార్ అవుతారు అని అనుకున్నారా ..?పద్మభూషణ్ , పద్మ విభూషణ్ అందుకునే స్థాయికి మీరు వస్తారు ..?” అని ఊహించారా..? అంటూ ప్రశ్నించారు .

దీనికి చిరంజీవి ఎక్సలెంట్ ఆన్సర్ ఇచ్చాడు . “ఎస్ నేను ఊహించాను .. ఈ పొజిషన్ కి రావాలి అని ఎంతో కష్టపడ్డాను.. కాబట్టే వచ్చాను ” అంటూ చెప్పుకొచ్చారు . అంతేకాదు చిరంజీవి స్కూల్ టైం నుంచే ఎక్కువగా నాటకాలు వేసేవారట . ఆ టైంలో చిరంజీవి బయట ఎక్కడ కనిపించినా ఊర్లో వాళ్ళు ఆయనను ఒక సెలబ్రిటీగా చూసేవారట. అప్పటినుంచి చిరంజీవికి హీరో అవ్వాలని పిచ్చి ఎక్కువగా పట్టుకుందట. చదువులో టాప్ మార్కులు వచ్చిన పెద్దగా పట్టించుకోరు కాని యాక్టింగ్ చేస్తే చాలా క్రేజ్ వస్తుంది అని భావించిన చిరంజీవి స్టార్ హీరో అవ్వాలి అని చాలా చాలా డిసైడ్ అయ్యారట . ఆయన కన్న కలలను నిజం చేసుకున్నాడు . ప్రెసెంట్ చిరంజీవి మాట్లాడిన మాటలు నెట్టింట వైరల్ గా మారాయి..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news