Moviesకోట్లు రెమ్యూన రేషన్ తీసుకునే పాన్ ఇండియా హీరోల కన్నా.. ...

కోట్లు రెమ్యూన రేషన్ తీసుకునే పాన్ ఇండియా హీరోల కన్నా.. గోపీచంద్ వెయ్యి రెట్లు బెటర్ .. ఎందుకంటే..?

గోపీచంద్ .. సినిమా ఇండస్ట్రీలో ఈ పేరుకి ఎలాంటి క్రేజీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . మొదట హీరోగా ఎంట్రీ ఇచ్చిన గోపీచంద్ .. ఆ తర్వాత విలన్ గా మెప్పించాడు .ఆ తర్వాత మళ్లీ హీరోగా సినిమాలు చేశాడు . ఇక్కడే యవ్వారం బెడిసి కొట్టింది . గోపీచంద్లో హీరోగా కన్నా విలన్ షేడ్స్ నే బాగా ఉన్నాయి అని విలన్ గా పాత్ర పోషించమంటూ కొందరు డైరెక్టర్స్ సజెస్ట్ చేశారు . కానీ గోపీచంద్ కి విలన్ షేడ్స్ పాత్రలు ఇష్టం లేక అలాంటి సినిమాలను వదులుకున్నాడు.

అయితే వచ్చిన హీరోయిజం సినిమాలు గోపీచంద్ కటౌట్ కి మ్యాచ్ అవ్వలేదు. దీంతో సోషల్ మీడియాలో ఆయనను బాగా ట్రోల్ చేశారు జనాలు. ఫిలిమ్ ఇండస్ట్రీలో కూడా పెద్దగా మార్కెట్ లేదు . రీసెంట్గా ఆయన నటించిన భీమా సినిమా కూడా యావరేజ్ గా నిలిచింది . అయితే భీమ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న గోపీచంద్ ఎవరికీ తెలియని టాప్ సీక్రెట్ ను బయటపెట్టాడు.

గోపీచంద్ తనకు ఉన్నంతలో సహాయం చేస్తూ ఉంటాడట . అలాగే చదువుకోవాలని ఇంట్రెస్ట్ ఉండి పేదరికంతో చదువుకో లేని వాళ్ళ కోసం తాను సంపాదించే దాంతో సగం కి పైగా ఖర్చు పెడతారట. ఈ విషయం ఎవరికీ తెలియదు. ” నేను చేసే పని ఒకరికి తెలియాల్సిన అవసరం నాకు లేదు. నేను చేసిన సహాయం వల్ల వాళ్ళు ఆనందపడి లైఫ్లో సెటిల్ అయితే చాలు .. నేను చాలామందికి హెల్ప్ చేశాను చాలామందిని చదివించాను .. వాళ్ళు ఇప్పుడు పెద్ద పెద్ద ఉద్యోగాలలో ఉన్నారు .. అది నాకు చాలా ఆనందం.. అసలు వాళ్ళకి నా పేరు కూడా తెలియదు “అంటూ చెప్పుకొచ్చాడు . దీంతో జనాలు షాక్ అయిపోతున్నారు. గోపీచంద్ లో ఇంత మంచి మనిషి కూడా ఉన్నాడా? కోట్ల రెమ్యూనరేషన్ తీసుకుంటూ ఆస్తులు కూడా పరుచుకునే హీరోల కన్నా గోపీచంద్ వెయ్యిరెట్లు బెటర్ అంటూ పోగిడేస్తున్నారు..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news