Moviesమన డార్లింగ్ మనసు దోచేసుకున్న డెవిల్ బ్యూటి.. జాక్ పాట్ ఆఫర్...

మన డార్లింగ్ మనసు దోచేసుకున్న డెవిల్ బ్యూటి.. జాక్ పాట్ ఆఫర్ కొట్టేసిందిరోయ్..!!

అదృష్టం ..ఎప్పుడు.. ఎవరిని ..ఎలా.. వరిస్తుందో ఎవ్వరు చెప్పలేం . అది ఆటోమేటిక్గా అలా జరిగిపోతూ ఉంటుంది . అంటే లేకపోతే నిన్న మొన్నటి వరకు అవకాశాలు లేక అల్లాడిపోయిన బ్యూటీలు ఇప్పుడు ఇండస్ట్రీలో టాప్ హీరోల సరసన మూవీలో నటిస్తున్నారు ..అంటే అదంతా అదృష్టమే . రీసెంట్గా అలాంటి అదృష్టాన్ని అందుకున్నింది డెవిల్ బ్యూటీ అంటూ న్యూస్ వైరల్ అవుతుంది. రీసెంట్గా కళ్యాణ్ రామ్ నటించిన డెవిల్ సినిమాలో కనిపించిన అమ్ము అభిరామ్ ..ప్రభాస్ సినిమాలో ఛాన్స్ కొట్టేసింది అన్న వార్తలు వైరల్ అవుతున్నాయి .

మారుతి డైరెక్షన్లో టాలీవుడ్ యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ ఒక సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాలో ముగ్గురు హీరోయిన్లు ఉంటున్నారు అంటూ ఎప్పటినుంచో ప్రచారం జరుగుతుంది. కాగా ఈ సినిమాలో వన్ ఆఫ్ ద హీరోయిన్ గా అమ్ము అభిరాం సెలెక్ట్ అయినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఫుల్ టు ఫుల్ కామెడీ ట్రాక్ లో రానున్న ఈ సినిమాలో ప్రభాస్ డిఫరెంట్ లుక్ లో కనిపించబోతున్నాడట. రీసెంట్గా డెవిల్ సినిమా చూసిన మారుతి అమ్ము అభిరామ్ పర్ఫామెన్స్ చూసి ఫిదా అయ్యారట .

అందుకే ప్రభాస్ సినిమాలో ఛాన్స్ ఇచ్చినట్లు తెలుస్తుంది . ఒకవేళ ఇది నిజమైతే మాత్రం అమ్మడు కెరియర్ ఇక దశతిరిగిపోయినట్లే. అందం, అభినయంతో తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకుంది తమిళ బ్యూటీ అమ్ము అభిరామి.. రాక్షసుడు.. నారప్ప.. Fచుక్ వంటి చిత్రాల్లో హీరోయిన్‏గా కనిపించి ఫుల్ క్రేజ్ అందుకుంది. ఇక జగపతి బాబు నటించిన Fచుక్ సినిమా.. వెంకటేష్ నటించిన నారప్ప సినిమాలు అమ్ము అభిరామికి గుర్తింపు తెచ్చిపెట్టాయి. నారప్ప మూవీలో వెంకి కోడలు.. ప్రేమికురాలిగా నటించి మెప్పించింది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news