Moviesఎన్టీఆర్ నెక్ట్స్ లైన‌ప్ వెరీ స్ట్రాంగ్‌... చేతినిండా క్రేజీ ప్రాజెక్టులే...!

ఎన్టీఆర్ నెక్ట్స్ లైన‌ప్ వెరీ స్ట్రాంగ్‌… చేతినిండా క్రేజీ ప్రాజెక్టులే…!

టాలీవుడ్ స్టార్ హీరోల‌లో ఒక‌రైన యంగ్‌టైగ‌ర్ త్రిబుల్ ఆర్ సినిమా త‌ర్వాత మ‌రే సినిమా చేయ‌లేదు. ప్ర‌స్తుతం కొర‌టాల శివ ద‌ర్శ‌క‌త్వంలో భారీ మాస్ యాక్ష‌న్ డ్రామాతో కూడిన దేవ‌ర సినిమా తెర‌కెక్కిస్తున్నారు. యువ‌సుధా ఆర్ట్స్ – ఎన్టీఆర్ ఆర్ట్స్ సంస్థ‌లు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమా పాన్ ఇండియా రేంజ్‌లో రిలీజ్ అవుతోంది. ఈ సినిమాలో ఎన్టీఆర్‌కు జోడీగా జాన్వీక‌పూర్ హీరోయిన్‌గా న‌టిస్తోంది.

దేవ‌ర త‌ర్వాత ఎన్టీఆర్ నెక్ట్స్ లైన‌ప్ చాలా స్ట్రాంగ్‌గా ఉంది. ఈ సినిమా త‌ర్వాత ఎన్టీఆర్ బాలీవుడ్ కండ‌ల హీరో హృతిక్ రోష‌న్‌తో క‌లిసి వార్ 2 సినిమాలో న‌టిస్తాడు. వార్ 2 పూర్త‌యిన వెంట‌నే దేవ‌ర 2 సినిమా ఉంటుంది. దేవ‌ర‌కు సీక్వెల్‌గా దేవ‌ర 2 ఉంటుంది. ఈ లోగానే ప్ర‌శాంత్ నీల్ సినిమా ఉంటుంది. పాన్ ఇండియా రేంజ్‌లో వ‌స్తోన్న ఈ సినిమాపై భారీ ఎక్స్‌పెక్టేష‌న్స్ ఉన్నాయి.

మైత్రీ మూవీ మేక‌ర్స్ బ్యాన‌ర్‌పై ఈ సినిమా తెర‌కెక్కుతోంది. దేవ‌ర 1,2, అటు వార్ 2, ఇటు ప్ర‌శాంత్ నీల్ సినిమాలు అన్నీ కూడా పాన్ ఇండియా స్కేల్లోనే తెర‌కెక్కుతున్నాయి. ఈ క్ర‌మంలోనే ప్ర‌భాస్ క‌ల్కి సినిమా ద‌ర్శ‌కుడు నాగ్ అశ్విన్ కూడా ఎన్టీఆర్‌తో ఓ భారీ పాన్ ఇండియా సినిమా ప్లాన్ చేస్తున్నారు. ఏదేమైనా త్రిబుల్ ఆర్ సినిమాతో ఎన్టీఆర్‌కు వ‌చ్చిన ఇమేజ్‌ను పాన్ ఇండియా రేంజ్‌లో అలాగే కంటిన్యూ చేసేలా ఎన్టీఆర్ నెక్ట్స్ స్టెప్ ఉంది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news